Skin Health Care: మనకు నలభై ఏళ్ల తరువాత ముఖంపై మడతలు సహజమే. ముసలి తనం వస్తుందనడానికి ఇవే సంకేతాలు. దీంతో వీటి నుంచి దూరం కావడానికి ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తుంటాం. కొంతమంది ఫేషియల్ క్రీములు వాడతారు. వ్యాయామం చేయడం ద్వారా కూడా మనం ముడతలు తగ్గించుకోవచ్చు. ఇలా రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. చర్మం నున్నగా మెరిసేలా చేసుకోవాలని తాపత్రయ పడుతుంటారు. కొన్ని చిట్కాల ద్వారా నలభై తరువాత కూడా యవ్వనంగా కనబడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
బ్లూ బెర్రీలు
మనం యవ్వనంగా కనిపించడానికి ఉపయోగపడే పండ్లలో బ్లూ బెర్రీలు ముఖ్యమైనవి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉండటంతో మన చర్మం ముడతలు పడకుండా చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మనకు ముడతలు రాకుండా చేయడంలో సాయపడతాయి. బ్లూబెర్రీలు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. శుభ్రంగా కూడా మారుతుంది.
దానిమ్మ
దానిమ్మలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సూర్యరశ్మి వల్ల చర్మం కందిపోయే అవకాశం ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు దానిమ్మ సాయపడుతుంది. చర్మం కాంతివంతంగా మెరవడానికి ఇది ఎంతో దోహదడుతుంది. ఇంకా దానిమ్మతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి.
అవకాడో
అవకాడో కూడా మంచి ప్రొటీన్లు ఉండే పండు. ఇందులో కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం మెరిసేలా చేస్తుంది. శరీరం ముడతలు పడకుండా చేయడంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. ముడతలు, సన్నని గీతలు కనిపించకుండా చేయడంలో ఇది తోడ్పడుతుంది. ముడతలు నివారించడానికి ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలు కూడా మనకు చర్మం ముడతలు పడకుండా చేసే పండ్లలో ఒకటి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. స్ట్రాబెర్రీలు కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడతాయి. చర్మం ముడతలు పడకుండా చూసుకోవడానికి అవసరమయ్యే చర్యలు చేపడుతుంది. ముడతలు రాకుండా చేయడానికి తనవంతు పాత్ర పోషిస్తుంది. పుచ్చకాయ కూడా చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయి.
నారింజ
నారింజ, బొప్పాయి పండ్లు కూడా చర్మం ముడతలు పడకుండా చేస్తాయి. ఇందులో కూడా కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమయ్యే వాటిని ఉత్పత్తి చేస్తుంది. బొప్పాయిలో కూడా పాఫైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండటంతో ముసలి తనం కనిపించకుండా చేస్తుంది.