spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM YS Jagan : రూ.10,400 కోట్లు వచ్చాయి కదా జగన్ సార్.. జీతాలెందుకు ఇవ్వట్లేదు

CM YS Jagan : రూ.10,400 కోట్లు వచ్చాయి కదా జగన్ సార్.. జీతాలెందుకు ఇవ్వట్లేదు

CM YS Jagan : ఉద్యోగులకు జీతాలెందుకు దండగ అనుకున్నారేమో కానీ వైసీపీ సర్కారు చుక్కలు చూపిస్తోంది. చేతిలో నగదు ఉన్నా జీతాలు అందించేందుకు మాత్రం వెనుకడుగు వేస్తోంది. ఒకటో తేదీకి కేవలం 20 శాతమంది ఉద్యోగులకే జీతాలు చెల్లించింది. ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ కింద తీసుకున్న అప్పులతోనే చెల్లించగలిగింది. ఇటీవల కొన్ని మార్గాల ద్వారా ఏపీ ఖజానాకు డబ్బులు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో జీతాల సమస్య ఉండదని అంతా భావించారు. కానీ ఆ నగదు ఎటుపోయిందో తెలియదు కానీ.. జీతాల సమస్య మాత్రం అలానే కొనసాగుతోంది.

ఎప్పుడో చంద్రబాబు హయాంలో అడిగిన రెవెన్యూ లోటు రూ.10,400 కోట్లను మోదీ సర్కారు విడుదల చేసింది. దీంతో సంక్షేమ పథకాల బటన్ నొక్కేందుకు ఎటువంటి ఇబ్బందులుండవని భావించారు. రిజర్వ్ బ్యాంకు నుంచి వివిధ రూపాల్లో అప్పుల ద్వారా మరో రూ.5 వేల కోట్లు వచ్చి చేరాయి. దీంతో జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదనుకున్నారు. కానీ ఒకటో తేదీ వస్తేనే కానీ అసలు విషయం బయటపడింది. కేవలం  ఇరవై శాతం మందికి మాత్రమే జీతాలు ఇవ్వగలిగారు. మిగతా 80 శాతం మందికి ఎదురుచూపులు తప్పడం లేదు.

అటు రెవెన్యూ లోటు, ఇటు అప్పుల రూపంలో వచ్చిన డబ్బులు ఎటు పోతున్నట్టు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చిన నగదు ఏం చేశారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.  కేంద్రం రూ. పది వేల కోట్లు నగదు బదిలీ చేస్తే… రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తుందేమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  ఏమైనా అప్పులు తిరిగి చెల్లించారా లేకపోతే… పాత బాకీల కింద కేంద్రమే ఆ సొమ్ములు జమ చేసుకుందా అన్నది తెలియాల్సి ఉంది. అస్మదీయ కాంట్రాక్టర్లకు ఏ పనులూ చేయకుండానే చెల్లించేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

ఏపీలో ఆర్థిక వ్యవహారాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు. ఇది ప్రైవేటు కంపెనీ కాదు. అది ప్రజాప్రభుత్వం. ప్రజలు పన్నులుగా కట్టే సొమ్ములతోనే ప్రభుత్వం నడుస్తోంది. వాటి జమా ఖర్చులపై పూర్తి సమాచారం ప్రజలకు తెలియచెప్పాలి. ఈ విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కనీస ప్రకటన చేయని ప్రభుత్వం, శ్వేతపత్రం విడుదల చేయాలని కోరడం కొంచెం అతే అవుతుంది. కానీ ప్రజల అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version