Hanuman: హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుళ్లలో హనుమంతుడు కూడా ఒకరు. దేశంలోని దాదాపుగా అన్ని ప్రధాన ప్రాంతాలలో హనుమంతునికి గుళ్లు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి హనుమంతుడిని స్థానిక ప్రజలు వేర్వేరు పేర్లతో పిలుస్తారు. శ్రీరాముని బంటుగా హనుమంతుడు ప్రజలకు సుపరిచితం కాగా వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు జన్మించాడు కాబట్టి కొంతమంది హనుమంతుడిని వాయుసుతుడని కూడా పిలుస్తారు.
శక్తిమంతుడు, బలశాలి అయినప్పటికీ హనుమంతుడు అల్లరి చేసేవాడు. అయితే ఒక గ్రామంలోని ప్రజలు మాత్రం హనుమంతుడి పేరు పలకడానికి కూడా ఇష్టపడరు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ద్రోణగిరి గ్రామంలో ఆంజనేయస్వామికి ఒక్క గుడి కూడా లేదు. ఈ గ్రామంలో ఎవరైనా హనుమంతుడిని పూజిస్తే అలా చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ గ్రామ ప్రజలు హనుమంతుడిని పూజించకపోవడానికి బలమైన కారణమే ఉంది.
Also Read: ప్రత్యేక హోదా’ ఆ ఎన్నిక కోసమేనా?
లక్ష్మణుడు అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో హనుమంతుడు తమ ప్రాంతం నుంచి సంజీవని పర్వతాన్ని తీసుకొని వెళ్లాడని భావించి ఆ గ్రామ ప్రజలు హనుమంతునికి పూజలు చేయడం లేదు. తమ గ్రామానికి సంజీవని పర్వతాన్ని హనుమంతుడు దూరం చేశారని ఇక్కడి ప్రజలు భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఆంజనేయునికి దేవాలయాలు ఉన్నాయనే విషయం తెలిసిందే.
ఆంజనేయుని జీవిత చరిత్రతో పలు సినిమాలు కూడా తెరకెక్కడం గమనార్హం. విదేశాలలో కూడా ఆంజనేయునికి దేవాలయాలు ఉన్నాయి. రామ రావణ యుద్ధం జరిగే సమయంలో మేఘనాథుని బాణం తగలడంతో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. ఆ సమయంలో చికిత్స కొరకు సంజీవని పర్వతంను ఆంజనేయుడు తీసుకొచ్చారు.
Also Read: చినజీయర్ స్వామిపై కేసీఆర్ కోపానికి అసలు కారణం అదేనా?