ICMR Recruitment 2022: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. జూనియర్ నర్సు, లేబొరేటరీ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 13 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. పదో తరగతి, ఇంటర్, ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
2022 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీలోపు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://onlineapply.nimr.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫిబ్రవరి 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా ఫీల్డ్ వర్కర్ ఉద్యోగ ఖాళీలు 4, జూనియర్ నర్సు ఉద్యోగ ఖాళీలు 3, లేబొరేటరీ టెక్నీషియన్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ 3 ఉన్నాయి.
Also Read: యూపీని షేక్ చేస్తున్న అతిపెద్ద సమస్య.. తీర్చేవారిదే ఈసారి గెలుపు?
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్ డిగ్రీ ఉన్నవాళ్లు ఎంబీబీఎస్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్ లో పన్నెండో తరగతి అర్హతతో పాటు మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్‌లో డిప్లొమా చదివిన వాళ్లు లేబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్ కు అర్హులు. సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ పాసైన వాళ్లు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌లో ఇంటర్ చదివి అనుభవం ఉన్నవాళ్లు ఫీల్డ్ వర్కర్ జాబ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్ సబ్జెక్టులతో ఏ.ఎన్.ఎం చదివిన వాళ్లు జూనియర్ నర్స్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 17,520 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
Also Read: కాంగ్రెస్ తో కేసీఆర్? కొత్త పార్టీ దిశగా రేవంత్ రెడ్డి?