https://oktelugu.com/

Kcr And Jagan: జగన్ ను ఇరుకున పెట్టిన కేసీఆర్

Kcr And Jagan: తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని రోజుల నుంచి కేంద్రంపై భగ్గుమంటున్నారు. పలు విషయాలపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ రోజుకో అంశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ బావులకు కరెంట్ మీటర్లు పెట్టే విధానంపై మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల భావులకు మీటర్లు పెట్టే అవకాశం ఇవ్వమని అంటున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే పథకం ప్రయోగాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. దీంతో పక్క […]

Written By:
  • NARESH
  • , Updated On : February 14, 2022 3:23 pm
    KCR-Jagan

    KCR-Jagan

    Follow us on

    Kcr And Jagan: తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని రోజుల నుంచి కేంద్రంపై భగ్గుమంటున్నారు. పలు విషయాలపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ రోజుకో అంశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ బావులకు కరెంట్ మీటర్లు పెట్టే విధానంపై మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల భావులకు మీటర్లు పెట్టే అవకాశం ఇవ్వమని అంటున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే పథకం ప్రయోగాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. దీంతో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీటర్ల విషయంలో యుద్ధం చేస్తుంటే.. ఏపీ సీఎం మాత్రం రైతులకు మీటర్లు పెట్టుకోవాలని సూచించడంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

    KCR-Jagan

    కేంద్రంపై యుద్ధం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మోదీపై చేసిన వ్యవసాయ మీటర్ల వ్యాఖ్యలో ఏపీలో కలకలం రేపినట్లయింది. వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే నిజంగానే తమ బతుకులు ఆగమైపోతాయా..? అని ఏపీ రైతులు అనుకుంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం మీటర్లు పెట్టిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పాతికవేల మీటర్లు సీఎం జగన్ పెట్టించారని కేసీఆర్ అన్నారు. అంతేకాకుండా ఎఫ్ఆర్ బీఎం రుణాల కోసం ఏపీ ప్రభుత్వం సంస్కరణలకు ఒప్పుకుందని అన్నారు. అయితే ఏపీలో కేవలం శ్రీకాకుళంలోనే కాకుండా పలు జిల్లాల్లో మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

    అయితే గతంలోనే ఇలాంటి విషయంలో ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలో ప్రభుత్వం స్పందించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎంత కరెంట్ వాడుకున్నా ఆ మొత్తం రైతు అకౌంట్లో వేస్తామని చెప్పింది. రైతులు బిల్లులు కడితే చాలని అన్నారు. అయితే ఈ నగదు బదిలీ పథకంపై నమ్మకం లేదని కొందరు రైతులు అంటున్నారు. మరోవైపు పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ అంత క్లారిటీగా మీటర్లు పెట్టబోమని చెబుతుంటే ఏపీ సీఎం మాత్రం ఈ విషయంలో వెనుకడుగు ఎందుకు వేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

    దీంతో ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయని అంటున్నారు. అయితే కేసీఆర్ రైతుల శ్రేయస్సు కోసం తాము ఎంతటి పోరాటానికైనా దిగుదామని, ముఖ్యంగా రైతులకు అన్యాయం చేస్తే అస్సలు ఊరుకోమని అంటున్నారు. అయితే సీఎం స్థాయిలో కేసీఆర్ ఇంత పకడ్బందీగా కేంద్రంపై ఎదురుతిరిగితే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.