Children : నేటి కాలంలో సంతానం కలిగిన ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. తాము పడ్డ కష్టం పిల్లలు భవిష్యత్తులో పడవద్దు అని తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులు వారి కోసం.. వారు సుఖంగా బతకడానికి ఎక్కువ డబ్బు సంపాదించి పెడుతూ ఉంటారు. మరికొందరు వారికి మంచి విద్యను అందించాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే విత్తనాలు అందించే తల్లిదండ్రుల గురించి మాట్లాడితే.. ఈరోజుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రవర్తన చిత్ర విచిత్రాలుగా ఉంటుంది. తమ విద్యార్థి బాగా చదవాలనే ఉద్దేశంతో వారు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఈ పొరపాట్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. అంతేకాకుండా వారిని అయోమయంలో పడేసి వారికి ఏం కావాలో తెలుసుకోలేక విద్యార్థులు భవిష్యత్తులో నష్టపోతున్నారు. అసలు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ఏమిటంటే?
Also Read : ఈ విషయాలను పిల్లలకు చెప్పకండి..
విద్యార్థుల చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. ఎందుకంటే ముందుగా మంచి పాఠశాలలో చేర్పించాలని ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటారు. మంచి పాఠశాల అయితేనే జాయిన్ చేస్తామని అనుకొని అందులో చేర్పిస్తారు. అయితే తాము ఎలాగో డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టి మంచి పాఠశాలలో చేర్పించాము కాబట్టి దానికి అనుగుణంగా విద్యార్థులు చదువు ఉండాలని నిత్యం కోరుతూ ఉంటారు. ఈ క్రమంలో విద్యార్థులపై ఒత్తిడిని తీసుకువస్తూ ఉంటారు. ఒత్తిడిలో భాగంగా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? ఏం చదువుతున్నారు? అనే విషయాలపై కాకుండా వారు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు? ఎంత గ్రేడ్ సంపాదించారు? అనేది మాత్రమే చూస్తున్నారు.
హిరణ్యకషపుడు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇతను రాక్షసుడు అయిన తన కుమారుడు ప్రహల్లాదుడు విషయంలో ప్రతిరోజు తను ఏం నేర్చుకున్నాడో తెలుసుకునేవాడు. ప్రహ్లాదుడు ఎంత గ్రేడ్ సంపాదించాడు? ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు? అనే విషయం ఆలోచించకుండా… తాను ఈరోజు ఏం నేర్చుకున్నావు? నేర్చుకున్న దానిని అనుసరించి నీకు నచ్చిన మంచి పద్యం చెప్పాలి అని హిరణ్యకషపుడు అడిగేవారు.
అంటే ఇక్కడ ప్రతి విద్యార్థిలో ఎంత నేర్చుకున్నావు అనేది చూడాలి అని కొందరు పండితులు చెబుతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు వారు ఎంత జ్ఞానం పొందుతున్నారు అనేది కావాలి? ఏ గ్రేడు బి గ్రేడ్లు ఇప్పుడు వస్తాయి. కానీ భవిష్యత్తులో ఇవి ఏమాత్రం జీవితాన్ని చక్కబెట్టవు అని పేర్కొంటున్నారు. అందువల్ల వారు కొత్తగా ఏం నేర్చుకుంటున్నారు వారికి సొంతంగా ఎటువంటి జ్ఞానం వస్తుంది? అనే విషయాలను బాగా గమనించాలి అని అంటున్నారు.
విద్యార్థులకు నేటి కాలంలో కావాల్సింది చదువు మాత్రమే కాదని.. వారి అలవాట్లు.. ప్రవర్తన చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఎందుకంటే చదువు కాస్త తక్కువ అయినా ఏం పర్వాలేదు కానీ వారిలో సొంత తెలివి రాకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి కాలంలో తల్లిదండ్రుల పై ఆధారపడి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కానీ భవిష్యత్తులో వారి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా సొంతంగా పనులు చేసుకోవడం రాకపోతే ఎంత చదువుకున్నా వ్యర్థమే.
Also Read ; పిల్లలు పెంచే తల్లిదండ్రులు ఈ సూత్రాలను పాటిస్తే మంచి వారవుతారు..