Person : జీవితం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. కానీ తమ జీవితం గురించి చాలామందికి తమకే నమ్మకం ఉండదు. ఎందుకంటే కొంతమంది ఇతరుల మాటలను, ఇతరుల ప్రవర్తనను బట్టి జీవిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకొందరు సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి తమ జీవితం మారుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి వ్యక్తి ఎవరికి వారే గొప్ప అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎవరి జీవితం వారిదే.. ఎవరి ఆనందాలు వారివే.. ఇలాంటి సమయంలో ఇంకొకరి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం చేయవద్దు. ఎందుకంటే సమాజంలో మంచి వారు ఉంటారు ..చెడ్డవారు ఉంటారు.. వీరిని ఎదుర్కొంటూ ముందుకు పోవడమే అసలైన జీవితం. మరి ఇందుకోసం ఏం కావాలి?
జీవితం నమ్మకం అనే ఇరుసు మీద ఆధారపడి ఉంటుందని ఇప్పటికే చాలామంది చెప్పారు. ఇదే సమయంలో ప్రతి వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం ద్వారా ఏ పనైనా ఈజీగా పూర్తి చేయగలుగుతాడు. ముందుగా తనమీద తనకు నమ్మకం ఏర్పడిన తర్వాతనే ఇతర పనులను ప్రారంభించాలి. ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత గట్టిగా దానిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే అది ఏ ఆటంకం లేకుండా పూర్తవుతుంది. అలాకాకుండా ఇతరుల భావాలను బట్టి.. ఇతరుల పనులను బట్టి పనులను మార్చుకోవడం ద్వారా ఆ పనులను ఎప్పటికీ పూర్తి చేయలేరు.
Also Read : చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ వస్తుంది
ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలని కోరుకుంటారు. అయితే అందరూ అన్ని సమయాల్లో గెలుపొందడానికి అవకాశం లేదు. కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఆత్మవిశ్వాసం అనేది కచ్చితంగా అవసరం అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే ఇక ముందుకు వెళ్లడానికి. అందువల్ల ఎవరికి వారు తమ సామర్థ్యాన్ని గుర్తించుకొని ఖచ్చితంగా ఆ పని చేయగలమని నమ్మకం ఏర్పరచుకొని ముందుకు వెళ్లాలి. అలా చేసినప్పుడే ఎన్ని పనులైనా పూర్తి చేయగలుగుతారు. జీవితంలో విజేతలుగా నిలుస్తారు.
అయితే కొందరు ఇతర వ్యక్తులు చేసే పనులపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. వారి తప్పొప్పులను గుర్తిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తారు. ఇలాంటి వారిని పట్టించుకోవడం వల్ల ఉన్నచోట నుంచి కదలరు. ఇలాంటి వారిని దూరం పెడుతూ ఎవరికి వారే తమ బలాన్ని పెంచుకుంటూ పనులు పూర్తి చేయడానికి ముందుకు సాగాలి. ఇలా ఇబ్బంది పెట్టే వ్యక్తులు తారసపడిన వారిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లడం ద్వారా జీవితం విజయవంతం అవుతుంది. అలా కాకుండా ప్రతి చోట.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న వెనుకడుగు వేయడానికి ప్రయత్నించదు.
తనకోసం కాకుండా కుటుంబ సభ్యుల కోసం చేసేవారు ఇంకా గొప్పవారు. అయితే ఇలాంటి సమయంలో కూడా చివాట్లు, వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా నమ్మకంతో ఒక పనిని చేయాలని అనుకున్నప్పుడు దానిని కచ్చితంగా పూర్తి చేయాలి. అలాకాకుండా వారికోసం.. వీరి కోసం అన్నట్లుగా ఏ పనులు చేయొద్దు. అలా ఎన్ని పనులు చేసిన వ్యర్ధంగానే ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎవరికైతే సాయం చేస్తున్నారో వారి మన్న నలను పొందలేరు. అందువల్ల ప్రతి వ్యక్తికి ఆత్మవిశ్వాసం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోవాలి.
Also Read : తీసుకునేవారికి అలర్ట్.. వచ్చే నెలలోపే తీసుకోండి!