Children Care: ప్రస్తుత కాలంలో పిల్లల మనస్తత్వాలు విచిత్రంగా మారిపోతున్నాయి. వాయిస్ తో సంబంధం లేకుండా వారు ఇతరులతో ఘర్షణలకు దిగుతున్నారు. కొందరు తల్లిదండ్రులు చెపుతున్న మాట ఏందంటే.. సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. తమ పిల్లలు ఇలా తయారయ్యారని అంటుంటారు. కానీ వాస్తవానికి ఏ పిల్లలైనా ముందుగా నేర్చుకునేది తల్లిదండ్రుల ద్వారానే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఎలాంటి పనులు చేస్తే పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను కొన్ని రకాలుగా కట్టడి చేస్తూ.. వారిని ఇతరులతో కలవనీయకుండా చేస్తూ.. స్వేచ్ఛగా ఆడుకోనీయకుండా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారు తమ మనసులో ఘర్షణ వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. అయితే తల్లిదండ్రులు చేయకూడని పని ఏంటో తెలుసా?
సమాజంలో అందరూ ఒకే లాగా ఉండాలని రూల్ ఏమి లేదు. కానీ ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల కొందరు వ్యక్తుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో వారి మధ్య ఎలాంటి సంప్రదింపులు ఉండవు. అయితే వీరు ఇంటి పక్కనే ఉండడంతో మరి ఇబ్బందిగా ఉంటుంది. కానీ వారితో సంబంధం లేకుండా వారి పిల్లలు కలిసి ఆడుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వారు కలిసి చదువుకుంటూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు మాత్రం అలా కలవనీయకుండా దూరంగా ఉంచుతూ ఉంటారు. అంతేకాకుండా కొందరు క్యాస్ట్ ఫీలింగ్స్ తో పిల్లలను స్వేచ్ఛగా ఉండరీ వారు.
పిల్లల్లో ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల వారిలో విషయం పెరిగిపోతుంది. దీంతో పెద్దయ్యాక అది అలాగే ఉండిపోయి ఇతరులతో కలవకుండా ఒంటరిగా మిగిలిపోతారు. ఫలితంగా వారి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొందరికి ఇతరులతో అవసరం ఉంటుంది. కానీ వారిలో అహం పెరిగిపోతే ఇతరులతో మాట్లాడకుండా.. ఏది చెప్పకుండా వారిలోనే కృంగిపోతూ ఉంటారు.
అందువల్ల పిల్లలు పెంచే సమయంలో వారిలో విష భావాలు పెంచకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పాలి. ఒక మనిషితో మరో వ్యక్తి అవసరం ఎప్పటికైనా ఏ విధంగానైనా ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు అంతా మనవారే అన్నట్లుగా భావించాలి. తల్లిదండ్రుల మధ్య ఘర్షణ వాతావరణం ఉండవచ్చు. వారి మధ్య ఇంకో ప్రాబ్లమ్స్ తో మాట్లాడకపోవచ్చు. కానీ ఆ విషయాన్ని పిల్లలతో పంచుకోకుండా వారితో సంబంధం లేకుండా వెళ్లాలి.
పిల్లలు స్వేచ్ఛగా పెద్ద అయ్యాక నిజం ఏదో అబద్ధం ఏదో వాళ్లే తెలుసుకుంటారు. అప్పుడు ఎవరు మంచివారో చెడ్డవారు గుర్తుంచుకోగలుగుతారు. అయితే వారిని పెద్దయ్యేదాకా ఎలాంటి విష బీజాలు నాటకూడదు. పిల్లలను తల్లిదండ్రులు బాగా పెంచితేనే సమాజంలో వారు మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఒక సమాజం చెడిపోతుందంటే అందుకు తల్లిదండ్రుల పెంపకం కూడా కారణం కావచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించాలి. ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్ తరాల వారికి మంచి పౌరులుగా అందించలేరు.