Zodiac signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఆరు నెలలకోసం తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. వీటి మార్పు వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతాయి. దీంతో ఆయా రాశుల వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గ్రహాలన్నింటిలో శుక్ర గ్రహం ప్రశాంతంగా ఉంటుంది. ఈ గ్రహం అనుకూలిస్తే వారి జీవితాల్లో లక్ష్మీ కటాక్షం వచ్చినట్లే. అలాగే తెలివితేటలు, వ్యాపార హేతు బద్ధంగా వ్యవహరించే బుధుడు కూడా అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాడు. అయితే ఈ రెండు గ్రహాలు కలవనున్నాయి. దీంతో కొన్ని రాశులపై ప్రభావం పడి ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. డిసెంబర్ 13 నుంచి బుధుడు, శుక్రుడితో కలిసి ప్రయాణం చేయనున్నాడు. దీంతో 4 రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. ఈ కారణంగా వారి లైఫ్ లో ఎటువంటి మార్పులు ఉంటాయో చూద్దాం..
బుధ, శుక్ర గ్రహాల కలియకతో వృషభ రాశిపై ప్రభావం పడనుంది. ఈ రాశి వ్యాపారులు ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. ప్రియమైన వారితో జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యక్రమాల్లో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు ఎటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొన్నా విజయం తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కు సంబంధించిన శుభవార్తలు వింటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఇవి లాభిస్తాయి.
మిథున రాశిపై రెండు గ్రహాల కలయిక ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశి వారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. భాగస్వామి వ్యాపారం చేసేవారు కొత్త ఆదాయాన్ని పొందుతారు. పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవడం వల్ల లాభాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలతో పాటు పదోన్నతి లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.
బధ గ్రహం అనుకూలం వల్ల కొందరి జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ క్రమంలో బుధుడు, శుక్రుడితో కలయిక ఉండడంతో కన్య రాశిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీంతో వ్యాపారులకు అధిక ప్రయోజనాలు ఉంటటాయి. గతంలో ఎటువంటి సమస్యలు ఉన్నా.. తొలగిపోతాయి. శుక్రుడి అనుగ్రహం కూడా వీరికి ఉండడంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. వివాహం చేసుకోవాలని అనుకునేవారికి ప్రతిపాదనలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు శుభవార్తలు వింటారు.
తులా రాశి వారి జీవితం డిసెంబర్ 13 నుంచి మారిపోనుంది. ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులుతో అనుకోని లాభాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులు గణనీయమైన ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఇంట్లో ఓ శుభ కార్యం జరగడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇన్నాళ్లు శత్రువులుగా ఉన్న వారు మిత్రులుగా మారుతాయి. పిల్లల చదువుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇవి అధిక ప్రయోజనాలను కలిగిస్తాయి. బంధువుల నుంచి ధన సాయం అందుతుంది.