https://oktelugu.com/

Sankranthi Holidays AP: ఏపీలో సంక్రాంతి సెలవులు కుదింపు.. టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు!

పదో తరగతి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది విద్యాశాఖ. అందులో భాగంగా సంక్రాంతి సెలవులను కుదించింది. సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 11, 2024 / 10:15 AM IST

    Sankranthi Holidays AP

    Follow us on

    Sankranthi Holidays AP: ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడయింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ప్రభుత్వం తొలుత మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించాలని భావించింది. అయితే తాజా ప్రతిపాదనల మేరకు మార్చి 15 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇంకోవైపు టెన్త్ విద్యార్థులకు సంక్రాంతి సెలవుల్లోనూ మార్పు చేశారు. వారి పరీక్షల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే పరీక్ష ఫీజు ప్రక్రియ మొదలైంది. తొలుత మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని భావించారు. కానీ ఒక మూడు రోజులపాటు పొడిగిస్తూ 18 నుంచి నిర్వహించనున్నారు. రాజా ప్రతిపాదనల మేరకు మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ మార్చి 10తో ముగియనుంది.

    * మార్గదర్శకాలు జారి
    పదో తరగతి పరీక్ష కేంద్రాలపై తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది విద్యాశాఖ. కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 22న గణితం, 23న ఫిజికల్ సైన్స్, 26న బయోలాజికల్ సైన్స్, 27న సామాజిక అధ్యయనాలు, 28న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, మార్చి 30 నా మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా పరీక్షల షెడ్యూల్ను ప్రకటించనున్నారు.

    * ఆ మూడు రోజులకే సంక్రాంతి సెలవులు పరిమితం
    వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు సెషన్లలో.. పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సైతం క్లాసులు కొనసాగుతున్నాయి. సెలవు దినాల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి సైతం మూడు రోజులకు సెలవులను పరిమితం చేశారు పదో తరగతి విద్యార్థులకు. జనవరి 13, 14 ,15 తేదీలు మినహా అన్ని రోజులు అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.