https://oktelugu.com/

Megastar Chiranjeevi : ఈరోజు మోహన్ బాబు ను కలువబోతున్న మెగాస్టార్ చిరంజీవి…

ఇండస్ట్రీలో నటుల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం సీనియర్ నటులందరూ ఒకటవుతారని నిరూపించడంలో చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2024 / 10:20 AM IST

    Megastar Chiranjeevi

    Follow us on

    Megastar Chiranjeevi : ఇండస్ట్రీలో నటుల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం సీనియర్ నటులందరూ ఒకటవుతారని నిరూపించడంలో చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇండస్ట్రీలో ఎవరికీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తను ముందు నిలబడి దానిని సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అందువల్ల చిరంజీవిని చాలామంది ఇండస్ట్రీ పెద్దగా కూడా కొనియాడుతూ ఉంటారు. మరి మొత్తానికైతే ప్రస్తుతం చిరంజీవి మోహన్ బాబును కలవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…

    గత కొద్ది రోజుల నుంచి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో కొంతవరకు గొడవలైతే జరుగుతున్నాయి. ఇక ఏదో కారణం చేత వాళ్ళు గొడవలను క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక రీసెంట్ గా మోహన్ బాబు మనోజ్ మీద దాడి చేయించాడు అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి. ఇక దానికి తగ్గట్టుగానే మనోజ్ కూడా హాస్పిటల్ లో జాయిన్ అయి రెండు రోజులు పాటు చికిత్స చేయించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు నిన్న నైట్ ప్రముఖ మీడియా రిపోర్టర్ మీద దాడి చేశాడు. దాంతో ప్రతి ఒక్కరూ ఆయన మీద విమర్శలైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన అస్వస్థతకు గురై గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఇక తనని చూడడానికి ఈరోజు చిరంజీవి తరలిరానున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవికి మోహన్ బాబుకి అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. అయినప్పటికి వాళ్ళు ఎప్పటికప్పుడు కలిసిపోతూ ఉంటారు. ఇక ఆప్తమిత్రుడు అయిన మోహన్ బాబుని చూడడానికి చిరంజీవి వెళ్ళడం అనేది కొంతవరకు మంచి విషయమనే చెప్పాలి.

    ఇక వీళ్లిద్దరూ దాదాపు ఒకేసారి సినిమా కెరియర్ ను స్టార్ట్ చేసినప్పటికి చిరంజీవి మాత్రం టాప్ స్టార్ గా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకుంటే మోహన్ బాబు మాత్రం విలన్ గా చేసి, హీరోగా కొన్ని సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో కొంతవరకు విసిగిపోయిన ఆయనను చిరంజీవి కలిసి పరామర్శించి మోరల్ సపోర్ట్ గా నిలవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక పెద్దదిక్కు గా ఉన్నాడు. కాబట్టి తను ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏదో ఒక రకంగా వారిని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    ఇక అందులో భాగంగానే మోహన్ బాబుని కూడా కలిసి సమస్యలను తెలుసుకొని వీలైనంత వరకు వాళ్ల ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసే దిశగా చిరంజీవి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి చిరంజీవి చెప్పినట్టుగా మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ వింటారా లేదా అనేది…