Best Summer Foods: చలికాలం వెళ్లి వేసవికాలం ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది. దీంతో ఇకనుంచి ఎండలు భగభగ మండే అవకాశం ఉంది. ఎండాకాలంలో తీవ్రమైన ఎండతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శరీరం డిహైడ్రేషన్కు వరి కావడంతో ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇక పిల్లల్లో ఏ చిన్న సమస్య వచ్చినా బాధపడాల్సి వస్తుంది. అయితే ఇవి ఏర్పడకుండా ఉండాలంటే ప్రత్యేకించి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. వేసవి నుంచి తట్టుకోవడానికి.. అలాగే ఉష్ణోగ్రత పెరగకుండా ఉండడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా పిల్లలకు అందించాలి. వీటిని ఇవ్వడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా కొత్తగా వారికి శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వేసవిలో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే?
Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు
వేసవికాలంలో చిన్నపిల్లల్లో చాలామంది డిహైడ్రేషన్కు గురవుతూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎక్కువగా నీరు తీసుకొని ఉండరు. అలాగని పదేపదే నీరు తాగమన్నా తాగ రు. అయితే వారికి వివిధ రకాలుగా నీరు ఎక్కువగా ఉండే పదార్థాలను అందించాలి. ముఖ్యంగా హైడ్రేటెడ్ కలిగిన ఆహారాన్ని ఇవ్వాలి. వీటిలో పండ్లు ఇవ్వడం చాలా అవసరం. వేసవి కాలంలో కర్బూజా, మామిడి బొప్పాయి నారింజ వంటివి మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల వీటిని పిల్లలకు నిత్యం అందిస్తూ ఉండాలి. ఎక్కువ శాతం కర్పూజను ఇవ్వడంతో పాటు దోసకాయలను కూడా తినిపించే ప్రయత్నం చేయాలి.
ఫ్రూట్స్ మాత్రమే కాకుండా వేసవికాలంలో కొన్ని ప్రత్యేక కూరగాయలతో వంట చేయడం చాలా అవసరం. వీటిలో పాలకూర, క్యారెట్లు, బీట్రూట్, టమాటో వంటి కూరగాయలు వండడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అయితే పిల్లలు ఈ ఆహారాన్ని తినడానికి ఇష్టపడకపోతే వీటితో కొన్ని రకాల జ్యూస్ ని కూడా తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు క్యారెట్ లేదా బీట్రూట్ జ్యూస్ చేసి అందించడం ద్వారా వారు ఇష్టంగా తీసుకుంటారు. అలాగే కూర దోసకాయ తో కూడా కర్రీ చేయడం వల్ల వేసవి నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది.
మార్కెట్లోనే దొరికేవి కాకుండా ఇంట్లోనూ కొన్ని సలాడ్లు తయారు చేసి పిల్లలకు అందించాలి. మిక్స్డ్ ఫ్రూట్ తో కలిపి జ్యూస్ లో తయారుచేసి ఇవ్వడం ద్వారా ఇష్టంగా తీసుకుంటారు. అలాగే పెరుగుతో పాటు మజ్జిగ వంటి పదార్థాలను కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారి శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి ఎండ వేడి నుంచి తట్టుకునే శక్తి వస్తుంది. ఉదయం లేవగానే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ను అందించడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. వీటితోపాటు నిమ్మరసం వంటివి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి.
అయితే ఈ వేసవిలో ఎక్కువగా మసాలా ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా పిల్లలకు టీ వంటి ఉష్ణోగ్రత ఇచ్చే పానీయాలను దూరంగా ఉంచాలి. ఒకవేళ వీటిని తీసుకున్నా.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గించే ఫ్రూట్స్ లేదా జ్యూస్ లో తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఒకసారైనా మజ్జిగ లాంటిది తీసుకోవడం వల్ల శరీరం అదుపులో ఉంటుంది.
Also Read: రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు!