IT Jobs
IT Jobs: ప్రభుత్వరగం ఉద్యోగాలు 90 శాతం తగ్గిపోయాయి. ఇప్పుడు అంతా ప్రైవేటు ఉద్యోగాలే. ఇందులో కూడా ఐటీ జాబ్స్(It Jobs)కు ఉన్న క్రేజ్ వేరే. ఇంజినీరింగ్ పూర్తి కాగానే మంచి ఐటీ కంపెనీలో సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. అయితే ఐటీ కంపెనీలు కూడా ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉద్యోగాల్లో కొత విధిస్తున్నాయి. రిక్రూట్‌మెంట్‌లు నిలిపివేశాయి. నియామకాలు చేపట్టినా మునుపటిలా వేతనాలు ఇవ్వడం లేదు. మల్టీ టాలెంట్(Multy talent) ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాలానికి అనుగుణంగా ఐటీ ఉద్యోగులు అప్‌గ్రేడ్ కాకపోతే ఉద్యోగాలు ఊస్ట్ అవుతున్నాయి. నైపుణ్యం మెరుగు పర్చుకోకపోతే వేతనాలు పెరగడం లేదు. ఇందుకు వయసుతో సంబంధం లేకుండా ఆయా కోర్సులు చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఐటీ సంస్థలు వేతనాల పెంపు విషయంలోనూ ఇప్పుడు కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. తాజాగా ఎల్‌టీఐ మైండ్ ట్రీ(LTI mind Tree) సంస్థ తన ఉద్యోగుల వేతనాల పెంపునకు కొత్త మెలిక పెట్టింది. తమదగ్గర పనిచేసే మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతనాల పెంపునకు సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతకు లింక్ పెట్టింది. కంపెనీ వార్షిక అప్రైజల్ కసరత్తులో భాగమైన ఇదంతా ఎందుకన్నాదినిపై సంస్థ స్పష్టత ఇచ్చింది. తమ పాత్రల్లో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీల అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో టెస్టు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
పరీక్ష తప్పనిసరి..
మిడిల్, సీనియర్ లెవల్ మేనేజర్లు తప్పనిసరిగా నిర్వహించే పోటీ పరీక్షలో కోడింగ్, మ్యాథ్స్, ప్రాబ్లమ్ సాలింగ్ ఎబిలటీస్‌తోపాటు నైపుణ్యాలను అంచనా వేస్తారు. టీంలను లీడ్ చేసే విషయంలోనూ సంస్థ ఎదుగుదలకు అవసరమైన సాంకేతిక నిర్వహణ సామర్థ్యాలను అంచనా వేసేందుకు వీలుగా ఈ టెస్టు రూపొందిస్తున్నారు. నాలుగేళ్లకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవారికి ఈ పరీక్ష నిర్వహించి ఫలితాల ఆధారంగా వేతనాలు పెంచుతామని చెబుతున్నాయి.
మొదటి కంపెనీగా ఎల్‌టీఐ మైండ్ ట్రీ..
ఐటీ ఉద్యోగులకు వేతనాలు పెంపుపై ఈ తరణహా ట్రెండ్ మొదలు పెట్టిన సంస్థగా ఎల్‌టీఐ మైండ్‌ట్రీగా చెబుతున్నారు. పనితీరు మదింపు, నైపుణ్యాల ఆధారంగా వ్యవహరించే ఈ ప్రక్రియను మిగిలిన కంపెనీలు అనుసరించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అదనపు ఒత్తిడి వేతనాల పెంపుపై ప్రభావం చూపుతుందని, సామర్థ్యం మాత్రమే కాదు వేతనాల పెంపు వెనుక చాలానే అంశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. పరీక్ష పేరుతో మరింత వేధింపులకు గురిచేయడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరీక్ష నిష్పాక్షికంగా ఉండేలా ప్లాన్ చేశామని.. వారు ప్రిపేర్ అయ్యేందుకు తగిన సహకారం.. వనరులు అందజేస్తామని సంస్థ చెబుతోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Test tension increment if passed new trend in it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com