Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు మార్పులు చోటు చేసుకోవడం వల్ల వాటి ప్రభావం రాశులపై పడుతుంది. గ్రహాలు అన్నింటిలో శని గ్రహం అత్యంత శక్తివంతమైనది. మనుషులు చేసే తప్పులను సరిదిద్దె క్రమంలో శని కొన్ని కష్టాలను సృష్టిస్తారు. అయితే శని గ్రహం మొన్నటి వరకు కుంభ రాశిలో ఉండడంవల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఫిబ్రవరి 28 తో శని కుంభరాశి నుంచి అస్తమించారు. ఆ తర్వాత ఏప్రిల్ 8న తిరిగి మరో రాశిలోకి వెళ్తారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై ప్రభావం పడి తీవ్రంగా నష్టం కలిగి అవకాశం ఉంది. ఈ కాలంలో ఆయా రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరి ఏ రాశిలో తెలుసుకుందామా..
మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ 3 వరకు మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అదనపు ఖర్చులు ఉంటాయి. పెద్దల సలహా తీసుకొని ఏ పనిని ప్రారంభించరాదు. ఎవరినైనా అప్పు అడిగితే తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు. ఒకవేళ తప్పనిసరి అయితే తెలివితో ముందుకు వెళ్లాలి. కొత్త వ్యక్తుల మాటలు అసలే నమ్మొద్దు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఉంటుంది. అందువల్ల ఓపికతో వ్యవహరించాలి.
కర్కాటక రాశి వారికి శని అస్తమించడం వల్ల కష్టాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా ఉంటాయి. కొన్ని మాటలు వల్ల సమాజంలో విలువ పోతుంది. అందువల్ల ప్రతి మాట జాగ్రత్తగా వదలాలి. కుటుంబ సభ్యుల మధ్య గొడవ ఏర్పడినప్పుడు మానంగా ఉండడమే మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇతరులకు డబ్బు సాయం చేసే ముందు ఆలోచించాలి.
సింహ రాశి వారికి ఈ కాలంలో కష్టాలు తప్పవు. ఈ రాశి వారు ఉద్యోగస్తులయితే చాలా వరకు సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఓ విషయంలో అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. దగ్గర స్నేహితులే ఈ రాశి వారిని మోసం చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. కుటుంబ సభ్యులతో కలిసి వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా తీసుకోవాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు సుముఖత చూపించవద్దు. ఎవరైనా పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేస్తే పట్టించుకోవద్దు.
కుంభ రాశి వారికి 40 రోజులపాటు ఇబ్బందులు ఉండలు ఉన్నాయి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి మనశ్శాంతి కరువవుతోంది. స్నేహితులతో గొడవలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు అప్పుడే ప్రారంభించవద్దు. పెట్టుబడుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులు భాగస్వాములతో నిత్యం చర్చల్లో మునిగి తేలాలి. ఎక్కడ చిన్న తేడా వచ్చిన వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేకంగా సిద్ధ వహించాలి. వైద్య అవసరం పడితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.