Sleep Tourism : పడుకోవడానికి వెళ్తున్నారట.. అసలు ఏంటి స్లీప్ టూరిజం? దాని కథ ఏంటి?

ప్రస్తుతం ఉన్న ఈ టెన్షన్ వాతావరణంలో ఎవరైనా ప్రశాంతతను కోరుకోవడం సర్వసాధారణం. అందుకే.. కాస్త రిలాక్స్ కోసం నిద్ర తీస్తే బాగుండు అనే అందరూ అనుకుంటుంటారు. ఇందుకు మంచి ప్రకృతిని కూడా కోరుకుంటారు. ప్రకృతి మధ్య అందమైన ప్రదేశంలో నిద్ర పోవాలని కలలు కంటుంటారు. టూర్లకు వెళ్లిన కూడా కాస్త రిలాక్స్ కోసం ప్రయత్నిస్తుంటారు.

Written By: Chai Muchhata, Updated On : September 12, 2024 9:57 pm

Sleep Tourism

Follow us on

Sleep tourism : ప్రస్తుతం ఉరుకులు, పరుగుల జీవనంలో ఎప్పుడు పడుకుంటున్నామో.. ఎప్పుడు నిద్ర లేస్తున్నామో కూడా తెలియదు. సమయానుసారం పడుకున్నదీ లేదు.. తగిన సమయం నిద్ర పోయిందీ లేదు. సమయం ప్రకారం తగినంత నిద్రపోతేనే అనారోగ్య సమస్యలు రావని వైద్యనిపుణులు చెబుతున్నారు. హాయిగా నిద్రపోవాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జర్నీలు అంటే చాలా మందికి ఇష్టం. కొన్నికొన్ని సార్లు ఆఫీసుకుల సెలవులు పెట్టి మరీ లాంగ్ ప్రయాణాలు చేస్తుంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు, ఆఫీసు టెన్షన్స్ నుంచి రిలీఫ్ కోసం ఫ్యామిలీలు, ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌లకు వెళ్తుంటారు. టూర్‌లకు కేవలం ఎంజాయ్ చేయడం కోసమే కాకుండా.. మానసిక ప్రశాంతత లభించేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు స్లీప్ టూరిజం ఎంచుకోవాలని అంటున్నారు. అసలు ఈ స్లీప్ టూరిజం అంటే ఏంటి.. అని ఆలోచిస్తున్నారా..? స్లీప్ టూరిజం అంటే టూర్‌లో హాయిగా నిద్రపోవడం. ఎక్కడికి వెళ్తే హాయిగా నిద్రపోవచ్చు.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? వాటి ప్రత్యేకత ఏంటి..? ఒకసారి తెలుసుకుందాం.

ప్రస్తుతం ఉన్న ఈ టెన్షన్ వాతావరణంలో ఎవరైనా ప్రశాంతతను కోరుకోవడం సర్వసాధారణం. అందుకే.. కాస్త రిలాక్స్ కోసం నిద్ర తీస్తే బాగుండు అనే అందరూ అనుకుంటుంటారు. ఇందుకు మంచి ప్రకృతిని కూడా కోరుకుంటారు. ప్రకృతి మధ్య అందమైన ప్రదేశంలో నిద్ర పోవాలని కలలు కంటుంటారు. టూర్లకు వెళ్లిన కూడా కాస్త రిలాక్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే.. ఈ తరహా టూరిజంలో స్లీపింగ్‌తోపాటే స్విమ్మింగ్, ట్రెక్కింగ్, పార్లర్ సెషన్, యోగా సదుపాయాలు కూడా అందిస్తున్నారు. యోగా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

అలాంటి ప్రశాంతత కోసం.. చౌక ధరలో భారతీయులకు రిషికేశ్ ఉత్తమైన టూర్ అంట. ఇక్కడ బస చేయడం, తినడం, ప్రయాణించడం ఇతర ప్రదేశాల కంటే చౌక. రిషికేశ్ అంటే కేరాఫ్ ప్రకృతి అందాలు. అందుకే.. దీనిని యోగా నగరంగానూ పిలుస్తుంటారు. ధాన్యం, యోగా చేసేందుకు ఇక్కడికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు లక్షల్లో వస్తుంటారు. ఈ ప్రదేశం స్లీప్ టూరిజానికి ఎంతో ఉత్తమమైనది. ఇంకా.. వినోదానికి ప్రసిద్ధి గాంచిన గోవా సైతం స్లీప్ టూరిజానికి కూడా ఉత్తమమైన ప్రదేశం. సముద్రం ఒడ్డున ఉన్న ఈ సిటీ అందాలను అందరినీ ఆకర్షిస్తుంటాయి. అందుకే.. నిత్యం లక్షలాది సంఖ్యలో టూరిస్టులు వెళ్తూనే ఉంటారు. సముద్రపు ఒడ్డున ఇసుకపై నిద్రించడం ద్వారా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇక దక్షిణ భారతదేశంలోనూ అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. కేరళ, తమిళనాడుతోపాటు కూర్గ్, మైసూర్, మున్నార్ వంటి ప్రాంతాలను ఎంచుకోవచ్చు. ఇక్కడ ధ్యానంతోపాటు ఆయుర్వేద చికిత్స కూడా అందుబాటులో ఉంది.