https://oktelugu.com/

Raj Tarun-Malvi Malhotra : మాల్వీ మల్హోత్ర కి క్షమాపణలు చెప్పిన రాజ్ తరుణ్..వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్!

రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్ర ముంబై లోని ఒక ప్రైవేట్ హోటల్ గదిలో ఉంటున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న లావణ్య, నేరుగా అక్కడికి వెళ్లి గొడవలు పెట్టుకుంది. ఆ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఎలా వైరల్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. అంతే కాదు రీసెంట్ గా ఈమె నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు కూడా పెట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 12, 2024 / 10:02 PM IST

    Raj Tarun-Malvi Malhotra

    Follow us on

    Raj Tarun-Malvi Malhotra : గత కొద్ది నెలల నుండి మీడియా లో రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం ఎలాంటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతిరోజు లైవ్ డిబేట్ ఉంటే చాలు లావణ్య డిబేట్స్ లో కూర్చొని రచ్చ రచ్చ చేసేది. అసలు ఈమె బాదేంట్రా బాబు అని ఆడియన్స్ తలలు పెట్టుకునేవారు. మధ్యలో శేఖర్ బాషా దెబ్బకి ఈమె నోటి నుండి మాటలు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజులు మీడియా ముందుకు రాకపోయేసరికి జనాలు ‘హమ్మయ్యా..ఈమె గోల వదిలింది రా బాబు’ అని అనుకున్నారు. కానీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్ర ముంబై లోని ఒక ప్రైవేట్ హోటల్ గదిలో ఉంటున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న లావణ్య, నేరుగా అక్కడికి వెళ్లి గొడవలు పెట్టుకుంది. ఆ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఎలా వైరల్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. అంతే కాదు రీసెంట్ గా ఈమె నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు కూడా పెట్టింది. ఇలా మళ్ళీ ఈమె గోల మొదలైంది. కాణి ఏమి చేసినా రాజ్ తరుణ్ ఈమెను పట్టించుకోవడం లేదు. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్ లో ఒక పోస్ట్ వేసాడు.

    ఆయన మాట్లాడుతూ ‘ రీసెంట్ గా నీ ఇంట్లో నా కారణంగా జరిగిన సంఘటనలకు నేను బాధపడుతున్నాను మాల్వీ. దయచేసి నన్ను క్షమించు, ఇంత జరిగినా కూడా నువ్వు నన్ను ద్వేషించలేదు. నీ స్నేహితులతో కలిసి వినాయక చవితిని అద్భుతంగా జరుపుకునే అవకాశం కల్పించావు’ అంటూ ఆయన వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మొత్తానికి వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు అనేది ఖరారు అయ్యింది. వీళ్ళు డేటింగ్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే లావణ్య తో ఆయన విడిపోయి చాలా కాలం అయ్యింది. లావణ్య కూడా మస్తాన్ బాషా అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది, ఆ తర్వాత అతనితో కూడా విడిపోయి ఇలాగే కేసు కూడా పెట్టింది. ఈమె మాత్రం ఎంత మందితో అయినా రిలేషన్ మైంటైన్ చెయ్యొచ్చు, రాజ్ తరుణ్ గుట్టుగా వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తే మాత్రం తప్పు.

    ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రాజ్ తరుణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భలే ఉన్నాడే’ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో రాజ్ తరుణ్ బిజీ గా గడుపుతున్నాడు. చూస్తుంటే ఆయన కెరీర్ లోనే ఈ చిత్రం బెస్ట్ గా నిలిచేలా ఉంది. టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్ తరుణ్ గత రెండు చిత్రాలు ఎప్పుడు విడుదల అయ్యాయి, ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయాయి అనే విషయమే జనాలకు గుర్తు లేదు. ఈ సినిమా అయినా ఆడుతుందా లేదా గత రెండు సినిమాల లాగానే అవుతుందా అనేది చూడాలి.