IND vs NZ : క్రికెట్లో ప్రస్తుతం బీసీసీఐ దే పెత్తనం నడుస్తోంది. బిసిసిఐ సెక్రటరీగా పనిచేసిన జై షా.. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మినహా మిగతా అన్ని జట్లకు బిసిసిఐనే ఆధారం. టీమిండియా తమ దేశంలో ఒక్కసారి పర్యటిస్తే చాలు అనుకునే జట్లు చాలా ఉన్నాయి. ఇక టీమిండియా పేరుకు తగ్గట్టుగానే అనేకసార్లు ఐసిసి టోర్నీలలో ఫైనల్స్ వెళ్ళింది. ఆస్ట్రేలియా తర్వాత ఎక్కువ ఐసీసీ టోర్నీలు గెలుచుకున్న జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. అయితే ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. 2017 లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమిండియా ఫైనల్ వెళ్ళింది. అయితే నాడు జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో టీమ్ ఇండియా ఓడిపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్ లోను టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. కానీ 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం టీమిండియా విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. టీమిండియా ఇన్నిసార్లు ఐసీసీ టోర్నీలలో ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఒకే ఒక్క ఆటగాడు సెంచరీ చేశాడు. ఇంతవరకు మరే ఆటగాడు కూడా ఆ రికార్డును అందుకోలేకపోయాడు.
Also Read : CT ఫైనల్ లో గెలిచేది ఎవరంటే?
అతడు ఒక్కడే సెంచరీ చేశాడు
ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీని.. ప్రారంభంలో ఐసీసీ నాకౌట్ టోర్నీగా పిలిచేది. 2000 సంవత్సరంలో కెన్యా వేదికగా నాకౌట్ టోర్నీని ఐసిసి నిర్వహించింది. ఆ సిరీస్లో టీమిండియా – న్యూజిలాండ్ ఫైనల్ వెళ్లాయి. ఆ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 264 పరుగులు చేసింది.. నాటి మ్యాచ్లో టీమ్ ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ 117 పరుగులు చేశాడు. సచిన్ టెండుల్కర్ 64 పరుగులు సాధించాడు. అయితే న్యూజిలాండ్ ఆ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఐసీసీ టోర్నీలలో ఏ భారతీయ ఆటగాడు కూడా సెంచరీ చేయలేదు. హాఫ్ సెంచరీల వరకే ఆగిపోయారు. అయితే ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఆదివారం జరిగే మ్యాచ్లో దుబాయ్ మైదానంలో ఎవరు సెంచరీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు సెంచరీ చేసి..భారత్ ను గెలిపించాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటగాళ్ల ఫామ్ ప్రకారం చూసుకుంటే గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లాంటివాళ్ళకు సెంచరీ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సెంచరీకి కొద్ది దూరంలో నిలిచిపోయాడు. అతడు గనుక మరింత నిగ్రహంగా ఆడి ఉంటే మరో సెంచరీ చేసి ఉండేవాడు. ఇక అయ్యర్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ 30 ఓవర్ల వరకు గనక క్రీ జ్ లో ఉంటే కచ్చితంగా సెంచరీ చేస్తాడని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యాని. మరి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా తరఫున సెంచరీ చేసే అదృష్టం ఎవరికి ఉందో.. మరికొద్ది గంటలు గడిస్తే గాని తెలియదు.
Also Read : CT ఫైనల్ రేపే.. విరాట్ కోహ్లీకి గాయం.. ఫైనల్ మ్యాచ్ లో ఆడతాడా?