Biscuits: పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ బిస్కెట్లను ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. టీ లేదా నీళ్లలో ముంచుకుని బిస్కెట్లను ఎక్కువమంది తింటూ ఉంటారు. పిల్లల ఆకలి తీర్చడానికి తల్లిదండ్రులు ఎక్కువగా బిస్కెట్లను తినిపిస్తూ ఉంటారు. అయితే తినడానికి ఎంతో రుచికరంగా ఉండే బిస్కెట్ల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

శాస్త్రవేత్తలు 60 వేర్వేరు బిస్కెట్లపై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. హాంగ్‌కాంగ్ పరిశోధకులు ఎక్కువగా బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. బిస్కెట్లను తయారు చేసే సమయంలో గ్లైసిడోల్, యాక్రిలమైడ్ అనే కెమికల్స్ ను వినియోగిస్తారు. పలు బిస్కెట్ ఫ్యాక్టరీలు నిబంధనలకు విరుద్ధంగా ఈ కెమికల్స్ ను వినియోగించాల్సిన మోతాదు కంటే ఎక్కువ మొత్తంలో వాడుతున్నాయి.
ఈ బిస్కెట్లను తినడం వల్ల క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. కిలో బిస్కెట్లను తయారు చేయాలంటే కేవలం 350 గ్రాముల పరిమితిలో మాత్రమే అక్రిలామైడ్ కెమికల్ ను వినియోగించాలి. కెమికల్స్ ను ఎక్కువ మోతాదులో వినియోగించిన కంపెనీలలో బిస్కెట్ కంపెనీలు ఉన్నాయి. కొన్ని బిస్కెట్లలో ఎంపీసీడీ అనే కెమికల్ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ కెమికల్ వల్ల కిడ్నీ, పునరుత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొన్ని బిస్కెట్స్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండగా 27 శాతం చక్కెర, సోడియం ఉన్నాయి. మన దేశంలో తయారవుతున్న క్రీమ్ బిస్కెట్లలో చక్కెర, కొవ్వు శాతాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళలు ఎక్కువగా బిస్కెట్లు తింటే ట్యూమర్లు, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.