Amazon Prime: దేశంలోని ప్రముఖ ఓటీటీలలో అమెజాన్ ప్రైమ్ ఒకటనే సంగతి తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు చేదుకబురు చెప్పింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధరలు త్వరలో భారీగా పెరగనున్నాయి. వార్షిక సబ్ స్క్రిప్షన్ ను, ఇతర సబ్ స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను అమెజాన్ సవరించడంతో కస్టమర్లకు భారం పెరగనుంది. అయితే ఎప్పటినుంచి సబ్ స్క్రిప్షన్ పెంపు అమలులోకి వస్తుందనే విషయాలను మాత్రం అమెజాన్ ప్రైమ్ వెల్లడించలేదు.

అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు ఇతర బెనిఫిట్స్ ను కూడా పొందే ఛాన్స్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు ఫ్రీ హోమ్ డెలివరీతో పాటు ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ఇతర బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ ఓటీటీ ద్వారా సినిమాలను చూసే వాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
ప్రస్తుతం సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ 999 రూపాయలు వసూలు చేస్తుండగా సబ్ స్క్రిప్షన్ ధర ఏకంగా 50 శాతం పెరుగుతుండటం గమనార్హం. ప్రైమ్ నెలవారీ ప్లాన్ 179 రూపాయలు కానుండగా ప్రైమ్ మూడు నెలల ప్లాన్ 459 రూపాయలు కానుంది. ప్రస్తుతం కొత్తగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకునే వాళ్లకు పాత ధరలే వర్తించనున్నాయి. పెరిగిన తర్వాత మాత్రం అందరికీ కొత్త ధరలు వర్తించనున్నాయి.
అయితే ఏకంగా 50 శాతం ధరలు పెంచడానికి అసలు కారణాలను అమెజాన్ ప్రైమ్ వెల్లడించకపోవడం గమనార్హం. అమెజాన్ ప్రైమ్ ఓటీటీని ఇష్టపడే వాళ్లు రాబోయే రోజుల్లో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కోసం ఎక్కువ మొత్తం చెల్లించక తప్పదని చెప్పాలి.