Sbi Alert: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా ఎస్బీఐకు పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యాంకు తాజాగా కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డును కచ్చితంగా లింక్ చేసుకోవాలని ఈ సంస్థ సూచిస్తోంది. బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డ్ ను లింక్ చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. మొదట పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్బీఐ లావాదేవీలు చేయవచ్చు.
ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకోని పక్షంలో పాన్ కార్డ్ ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పాన్ కార్డు ఇన్ యాక్టివ్ అయితే ఇన్ యాక్టివ్ అయిన కార్డు ద్వారా భవిష్యత్తులో ఎలాంటి లావాదేవీలు చేయడం వీలు కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని ఇప్పటికే సూచనలు చేసిన విషయం తెలిసిందే.
2022 సంవత్సరం మార్చి 31వ తేదీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో కూడా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. www.incometax.gov.in వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వెబ్ సైట్ లో ఎడమవైపు లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది.
ఆ అప్షన్ ను క్లిక్ చేసి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. లింక్ చేసిన కొన్నిరోజుల తర్వాత ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ అవుతుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Shocking news for sbi customers you cannot do that otherwise the account will close
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com