Daggubati Abhiram: తమిళ మాజీ లవర్ బాయ్ ‘శింబు’కి భారీ హిట్ వచ్చింది. ఆ సినిమా పేరే ‘మన్నాడు’. సినిమా చాలా బాగుంటుంది. అందుకే, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడ్డారు. అయితే, ఓ దశలో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి తీసుకుంది అన్నారు. అల్లు శిరీష్ హీరోగా ఈ సినిమాను తెలుగులో చేయబోతున్నారని టాక్ కూడా నడిచింది. అయితే, ఈ సినిమా రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ తీసుకుంది.

తెలుగులో త్వరలోనే ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ చేయబోతోంది. ఇందులో రానా హీరోగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ తమిళ సూపర్ హిట్ మూవీలో దగ్గుబాటి సురేశ్ బాబు కుమారుడు, రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించనున్నాడట. అందుకే ఈ సినిమా హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసిందట.
Also Read: బెణుకుల బాధల నివారణకు అతి సులువైన మార్గాలు !
తమిళంలో శింబు హీరోగా నటించగా.. ఆ రోల్ లో రానా చేస్తాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే.. రానాకు బదులుగా అభిరామ్‌తో రీమేక్ చేయాలని సురేశ్ బాబు డిసైడ్ అయ్యారట.
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘మానాడు’ రీమేక్ కాబోతుంది. మరీ అభిరామ్ కి ‘మానాడు’ ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి. అయితే, మన్నాడు సినిమాని కాపీ కొట్టింది ఎవరు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
గీతా ఆర్ట్స్ లో ‘మన్నాడు’ సినిమా కథను పోలిన ఓ కథను సిద్ధం చేస్తున్నారట. మన్నాడు కథ బన్నీ వాసుకి బాగా నచ్చింది అని, అందుకే.. గీతా ఆర్ట్స్ లో అలాంటి కథనే రెడీ చేయిస్తున్నాడని పుకార్లు మొదలయ్యాయి. మరి నిజంగానే మన్నాడు కథను మరో కోణంలో రాయిస్తుంటే కచ్చితంగా లీగల్ గా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
Also Read: రేవంత్ లాబీయింగ్ పనిచేసిందే.. కాంగ్రెస్ లోకి డీఎస్.. వ్యతిరేకిస్తున్న సీనియర్లు