Wedding Gifts: పరిమితికి మించి ఆదాయం లేదా ఆస్తులు ఉంటే ఆదాయపు పన్ను కట్టాలని చాలామందికి తెలిసిన విషయమే. అయితే మధ్యతరగతి ప్రజలకు దాదాపు పరిమితి లోపడే ఆదాయం ఉండే అవకాశం ఉంది. కానీ ఒక్కోసారి కొన్ని వ్యవహారాల వల్ల తమ బ్యాంకు ఖాతాలో పరిమితికి మించి ఆదాయం ఉన్నట్లు చూపిస్తుంది. ఇది వ్యాపారం వల్ల కావచ్చు లేదా ఇతర పనుల వల్ల కూడా కావచ్చు. అయితే ఆదాయపు పన్ను చట్టం కు అనుగుణంగా ఆదాయానికి సంబంధించిన లెక్కలు వివరించాల్సిందే. అవి ఏ రూపంలో వచ్చాయి? ఎందుకోసం వచ్చాయి? అనేది సంబంధిత అధికారులకు తెలియజేయాల్సిందే. అయితే ఒక్కోసారి పెళ్లి చేసుకున్నప్పుడు పరిమితికి మించి ఆదాయాలు, బహుమతులు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆదాయపు పన్ను కట్టాల్సిందేనా?
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి పరిమితికి మించి ఆదాయాన్ని కలిగి ఉంటే ఎంత ఎక్కువగా కలిగి ఉన్నాడో దానికి సంబంధించి పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఒక్కోసారి ఆదాయం వస్తూ.. వెళ్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆదాయపు పన్ను అధికారులు ఒక్కోసారి వారికి అందిన సమాచారం మేరకు రైడ్స్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భంలో సరైన వివరాలు ఉంటే ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ సరైన వివరాలు లేకపోతే మాత్రం జరిమానాలతో పాటు పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం ఆదాయపు పన్ను కట్టకుండా మినహాయింపు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే?
ఒక వ్యక్తి ఎప్పటికీ సాధారణ ఆదాయాన్ని పొందుతూ ఉండి.. తాను వివాహం చేసుకున్నప్పుడు నగదు రూపంలో లేదా బహుమతుల రూపంలో వచ్చిన ఆదాయం పరిమితికి మించి ఉంటుంది. ఇలా పరిమితికి మించి ఉన్నప్పుడు ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందితే వారు రైస్ చేసే అధికారం ఉంది. కానీ పెళ్లి కోసం వచ్చిన బహుమతులు అని తెలిస్తే వారు పన్ను కట్టమని అడిగే అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56 ప్రకారం ఆ వ్యక్తికి వచ్చిన విలువ పరిమితి కంటే ఎక్కువ ఉన్నా కూడా.. పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తికి కారు, ఇతర బహుమతుల రూపంలో ఎంతైనా ఆదాయం రావచ్చు. ఇవి అతడికి పెళ్లి బహుమతుల రూపంలో తీసుకుంటే ఆదాయపు పన్ను వర్తించదు. ఒకవేళ అనుకోకుండా ఐటీ అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినా కూడా వారికి వివరాలను తెలిపితే పన్ను వేయమని కోరరు..
అయితే పెళ్లి కాకుండా పుట్టినరోజు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు వచ్చిన బహుమతుల విలువ ఆదాయానికి మించి ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇన్కమ్ టాక్స్ పే చేయాల్సిందే. ఒక్క పెళ్లి విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. అందువల్ల పెళ్లి సమయంలో వచ్చిన బహుమతులు ఎన్ని ఉన్నా కూడా వాటిపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి.