Homeబిజినెస్Samsung Galaxy: రూ.30,000 లోపు ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరుగుతుంది!

Samsung Galaxy: రూ.30,000 లోపు ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరుగుతుంది!

Samsung Galaxy : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పుడు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ రూ.30,000 లోపు ఉండి ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, శాంసంగ్ గెలాక్సీ F56 5G, CMF Phone 2 Pro అద్భుతమైన ఆప్షన్లు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు, కెమెరా వివరాలు , ధర గురించి పూర్తిగా ఈ వార్తలో తెలుసుకుందాం.

Also Read: 3 ఏళ్లలోనే తిరుగుముఖం..ఎర్టిగాకు పోటీ ఇవ్వలేకపోయిన కియా

Samsung Galaxy F56 5G
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.27,000. ఈ ఫోన్ ఈజీగా ఎవరి జేబులోనైనా పట్టగలదు. Samsung Galaxy F56 5G ఒక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్. ఇది 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.4 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. దీని వలన గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఈ ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. దీనిని 1TB వరకు పెంచకోవచ్చు.

Samsung Galaxy F56 5Gలో కెమెరా
Samsung Galaxy F56 5Gలో ఫోటోలు , వీడియోల కోసం 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. అంతేకాకుండా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కెమెరాలో నైట్ మోడ్, ప్రో మోడ్ , స్లో మోషన్ వంటి అనేక మోడ్‌లు కూడా ఉన్నాయి.

CMF Phone 2 Pro
CMF ఫోన్ ధర సుమారు రూ.28,000. CMF Phone 2 Pro మరొక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఇది 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ , మల్టీటాస్కింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. దీనిలో 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. ఇది ఫోన్‌ను ఎటువంటి లాగ్ లేకుండా రన్ చేస్తుంది.

CMF Phone 2 Proలో కెమెరా
CMF Phone 2 Proలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా లభిస్తాయి. ఈ కెమెరా మంచి నైట్ షాట్‌లను, ఫోటోలను తీయగలదు. దీనిలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కెమెరాలో AI సపోర్ట్ కూడా ఉంది. ఇది ఆటోమేటిక్ గా బెస్ట్ పిక్సల్ క్వాలిటీని అందిస్తుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular