Qualities of a Sthitaprajna: మనిషి జీవితాన్ని నడిపించేది తనలో ఉండే లక్షణాలే. పూర్వకాలంలో కొన్ని కథల ద్వారా ఒక వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుపడతాడు.. ఎలాంటి లక్షణాలు ఉంటే చెడిపోతాడు అని చెప్పారు. వీరిలో ప్రధానంగా మహాభారతం గురించి.. అందులో పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహాభారతంలో ఉండే పాత్రలన్నీ ప్రస్తుతం సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. వీరిలో స్థితప్రతజ్ఞుడు గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి కొన్ని విషయాలు చెప్పాడు. స్థితప్రతజ్ఞుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడో? అతడు ఆ లక్షణాలను విడిచిపెట్టడం ద్వారా ఏం చేశాడో వివరించాడు. పరిస్థితి ప్రతిజ్ఞుడికి ఉన్న లక్షణాలు ఏంటి?
ప్రతి మనిషిలో ఆరు రకాలైన వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలను విడిచిపెట్టడం ద్వారా ఆ వ్యక్తి జీవితం బాగుంటుంది. సాధారణంగా ఈ ఆరింటిలో ఏదో ఒకటి ఉంటుంది. అయితే కొందరు దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఫలితంగా కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఈ ఆరు వికారాలు ఏంటంటే.. కామం, క్రోధం, లోభం,మొహం, మదం, మత్సర్యం..
వీటిలో ముందుగా కామం గురించి చెప్పుకుందాం. అధికంగా కామ కోరికలు ఉన్నవారు.. స్త్రీ పై ఎక్కువగా వ్యామోహం పెంచుకున్న వారు.. జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు.
క్రోదం అంటే ఎక్కువగా కోపాన్ని కలిగి ఉండడం. ప్రతి చిన్న విషయానికి కోపంతో ఉండడం వల్ల ఎదుటివారి ముందు చులకనగా మారిపోతారు. దీంతో ఏ పని పూర్తిగా చేయలేకుండా పోతారు. అంతేకాకుండా ఎక్కువగా కోపం ఉండటంవల్ల మనసులు దూరం అవుతారు.
Also Read: నేటి యువకులకు ఆదర్శం ఈ ఇద్దరు విద్యార్థులు.. ఎలాగంటే?
లోభం అంటే ఎక్కువగా డబ్బుపై ప్రేమ ఉన్నవారు. ఉన్నదాంట్లో సంతృప్తి చెందకుండా డబ్బు ఎక్కువ సంపాదించాలన్న ఆశ ఉండడం వల్ల మనసు ఎప్పుడు తృప్తిగా ఉండదు. దీంతో ఈ ఆశ ఒక్కోసారి క్రూరంగా కూడా మార్చేస్తుంది.
మొహం విషయానికి వస్తే.. ఏదో ఒక భ్రమలో ఉండిపోవడం. తాము గొప్ప వ్యక్తి అని ఇతరులు అంతా తమకింది వారే అని చిన్న చూపు చూడడం. లేదా తాము ఎప్పటికీ ఏదో ఒక బాధలో ఉంటున్నామని అనుకోవడం. ఎవరికి వారే ఆలోచనలు ఉండిపోవడం వల్ల తమ జీవితానికి అడ్డంకి ఏర్పడుతుంది.
మదం అంటే అహంకారం గురించి చెప్పుకోవాలి. ఒక వ్యక్తికి అహంకారం ఉంటే ఎప్పటికైనా తనను నాశనం చేస్తుంది. అహంకారం వల్ల కూడా మనసులు దూరము అవుతారు. బంధాలు తగ్గిపోతాయి. సమాజంలో గుర్తింపు తగ్గుతుంది.
Also Read: ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటారు?
ఇక చివరగా మత్సర్యం. అంటే ఒక వ్యక్తిపై ఈర్ష లేదా అసూయతో కలిగిన వారికి మత్సర్యం ఉందని చెబుతూ ఉంటారు. ఇలా ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన గురించి ఆలోచించకుండా తను ఒక పనికిరాని వ్యక్తిలా మారిపోతాడు. దీంతో ఆ వ్యక్తి తన జీవితాన్ని కానీ నాశనం చేసుకుంటూ ఉంటాడు.
ఇలా ఆరు లక్షణాలలో ఏదో ఒకటి కలిగివున్న ఆ వ్యక్తి జీవితానికి అనేక అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల ఈ ఆరు లక్షణాలను విడిచిపెడితే స్థిత ప్రతిజ్ఞుడు అని అంటారు.