Bank New rules : ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు అవసరం చాలామందికి ఉంది. అయితే ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడంతో చాలామంది బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అయితే బ్యాంకు తాకట్టు పెట్టుకోకుండా ఎలాంటి రుణాలు ఇవ్వదు. దీంతో బంగారం ఉన్నవాళ్లు దానిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు బ్యాంకు నుంచి బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి 75% లోన్ ఇచ్చేవారు. అలాగే బ్యాంకు రుణం చెల్లించిన తర్వాత కూడా వినియోగదారుల ఆభరణాలు ఇవ్వడానికి కొన్ని రోజుల సమయం తీసుకునేవారు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ ఎలా ఉన్నాయంటే?
బంగారం ఉన్నవారు డబ్బు అవసరం ఉంటే వెంటనే రుణం తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా బ్యాంకు నుంచి ఇచ్చే రుణం కంటే బంగారంపై తీసుకునే రుణం పై వడ్డీ తక్కువగా ఉంటుంది. అయితే గతంలో బంగారం తాకట్టు పెట్టుకున్న కేవలం 75% మాత్రమే రుణం ఇచ్చేవారు. అంటే లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణం తాకట్టు పెడితే రూ. 75,000 మాత్రమే ఇచ్చేవారు. అయితే కొత్త రూల్స్ ప్రకారం ఇప్పుడు బంగారం తాకట్టు పెడితే 85 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. అంటే లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణం తాకట్టు పెడితే రూ. 85,000 రుణం ఇస్తారు. అయితే రూ. 5 లక్షల లోపు అయితే 85% వరకు లోన్ ఇస్తారు. ఐదు నుంచి పది లక్షల లోపు అయితే 75% రుణం మంజూరు చేస్తారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించుకోవాలి.
అంతేకాకుండా బ్యాంకులో బంగారు ఆభరణం పై ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి.. అదే ఆభరణం పై టాప్ అప్ లోన్ కూడా ఇస్తారు. అంటే ఒక బంగారు ఆభరణం పై 70 శాతం వరకు లోన్ తీసుకుంటే.. మళ్లీ దీనిపై టాప్ అప్ లోన్ కొంతవరకు ఇస్తారు. అయితే ఎంత లోన్ ఇస్తారనేది వినియోగదారుల ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారుడి సిబిల్ స్కోర్ బాగుంటేనే టాప్ అప్ లోనికి అవకాశం ఇస్తారు.
బంగారు ఆభరణాలు బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకునే వరకు బాగానే ఉంటుంది. కానీ బ్యాంకు లోన్ క్లియర్ చేసిన తర్వాత కొన్ని బ్యాంకులు వెంటనే ఆభరణాలు ఇవ్వడానికి నిరాకరిస్తారు. అయితే ఇలా ఇవ్వకుండా ఏడు రోజుల వరకు వినియోగదారులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా ఏడు రోజుల పూర్తి అయిన తర్వాత కూడా చెల్లించకపోతే.. ఎనిమిదవ రోజు నుంచి రూ. 5000 చొప్పున పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అంటే పది రోజుల తర్వాత బ్యాంకులో బంగారు ఆభరణాలు ఇచ్చినా.. మూడు రోజుల పెనాల్టీ అంటే రూ. 15000 చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకునేవారు కొత్త రూల్స్ ను గమనించుకోవాలి.