Education success stories: చదువుకో పేదరికం అడ్డురాదు అని ఎంతోమంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయినా కొందరు తమ చదువుకు ఎన్నో కారణాలు చెబుతూ మధ్యలోనే మానివేస్తూ ఉంటారు. చదువుకోవాలని చిన్న ప్రయత్నాలు చేసి ఏవైనా ఆటంకాలు ఎదురైతే వెంటనే చదువు మానుకొని ఇంట్లోనే ఉండిపోతారు. ఇలా చేయడం వల్ల వారి భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. అయితే కొందరు మాత్రం తాము చదువుకొని ఎలాగైనా జీవితంలో మంచి స్థాయిలో ఉండాలన్న కోరిక, పట్టుదలతో ముందుకు వెళ్లారు. వారిలో ఈ ఇద్దరు విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎదురైనా వీరు ముందుకు వెళ్లి NEET లో ర్యాంకు సాధించారు. ఇంతకీ ఆ విద్యార్థులు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాలు మీకోసం..
Also Read: చరిత్ర సృష్టించిన భారత్.. నాలుగో స్థానం మన సొంతం
ఝార్ఖండ్ కు చెందిన రోహిత్ కుమార్ చదువును మధ్యలోనే ఆపివేశారు. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకోవడానికి వీలు కాలేదు. దీంతో మెడికల్ స్టోర్ లో పని చేసిన తర్వాత అతనికి డాక్టర్ కావాలన్నా కోరిక పుట్టింది. ఈ క్రమంలో ఎలాగైనా తాను మెడిసిన్ చదవాలని అనుకున్నాడు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల అతని కి అన్ని అడ్డంకులు ఎదురవచ్చి మొబైల్ షాప్ కవర్ వ్యాపారం పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఓవైపు మొబైల్ షాప్ కవర్ వ్యాపారం చేస్తూనే రాత్రులు ఆన్లైన్ లో చదువును కొనసాగించాడు. అలా ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత NEET కోసం ప్రిపేర్ అయ్యాడు. ఫలితంగా ఎంతో కష్టపడినా అతడు మొత్తానికి ర్యాంకు సాధించాడు.
మరో విద్యార్థి శ్రవణ్ కుమార్ కు మరోరకమైన కష్టాలు ఎదురయ్యాయి. తాను చదువుకోవాలని ఎంతో ఆశపడ్డ పేదరికం అడ్డు వచ్చింది. తల్లిదండ్రులు శుభకార్యాలయాల్లో పాత్రలు కడిగే వారు. దీంతో అతనికి చదువుకోవాలన్న కసి పట్టుదల పెరిగింది. రాత్రింబవలు అని చూడకుండా చదువును కొనసాగించాడు. అలా ఇంటర్లో 85% మార్కులు తెచ్చుకున్నాడు. అయితే ఆన్లైన్లో ప్రభుత్వ వైద్యులు అందించే కోచింగ్ తీసుకున్నాడు. అయితే మొదటి రెండుసార్లు తనకు ర్యాంకు రాలేదు. కానీ మూడోసారి ప్రయత్నం చేసి నీట్ లో ర్యాంకు సాధించాడు.
ఇలా చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని ఈ విద్యార్థులు నిరూపించారు. చాలామందికి నేటి కాలంలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ చదువుకోవడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. చదువుకునే వయసులోనే ఇతర వ్యసనాలు, వ్యాపకాలు మొదలవుతాయి. అయితే వాటి జోలికి వెళ్లకుండా కేవలం చదువుపైనే దృష్టి పెడితే జీవితంలో ఏది అయినా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చదువుతూనే వ్యాపారం చేయవచ్చు.. చదువుతోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు.
Also Read: మైక్రో సాఫ్ట్ పాక్ నుంచి వెళ్లిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? అసలు ఇన్ని రోజులు ఉండడమే గొప్ప కదా?
కానీ తమ చదువుకు కారణాలు అనేకం వెతికేవారు ఎప్పటికీ విజయాలు సాధించలేరు. అంతేకాకుండా తమ తర్వాతి వారికి కూడా కష్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఏమాత్రం వేరే ఆలోచన లేకుండా కేవలం చదువు పైన దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలి. అప్పుడే తమతో పాటు తమ కుటుంబ సభ్యుల జీవితం బాగుంటుంది.