Plug: మన ఇళ్లలో ఉండే టీవీ, ఫ్రిజ్, మిగ్రీ, గ్రైండర్, ఐరన్ బాక్స్ వంట్రి ఎలక్ట్రానిక్ పరికరాలకు త్రీ పిన్ ప్లగ్ ఉంటుంది. త్రీపిన్ సాకెట్‌కు కనెక్టు చేస్తేనే అవి పనిచేస్తాయి. విద్యుత్ ప్రవాహానికి ప్లస్, మైనస్ ఉంటాయని అందరికీ తెలుసు. అలాంటప్పుడు మూడో పిన్ ఎందుకు ఉంటుంది.. దానితో ఏం ఉపయోగం.. లేకుంటే ఏమౌతుంది అనే వివరాలు తెలుసుకుందాం.
ఎర్తింగ్ కోసం..
త్రీపిన్ ప్లగ్‌లో మూడు పిన్నులు సమాన పరమాణంలో ఉండవు. మూడో పిన్ను కాస్త లావుగా ఉంటుంది. ఈ పిన్‌కు లోపల గ్రీన్ కలర్ వైర్‌ను కలెక్షన్ ఇస్తారు. ఈ వైర్‌ను ఎర్త్ అంటారు. అంటే అర్థమై ఉంటుంది కదా.. ఈ మూడో పిన్‌ను ఎర్త్ కోసం ఉపయోగిస్తారన్నమాట.
విద్యుత్ ఉపకరణాల రక్షణకు..
ఈ మూడో పిన్‌కు కనెక్ట్ చేసి ఉన్న గ్రీన్ కలర్ వైర్‌లో సాధారణంగా విద్యుత్ ప్రవహించదు. ఈ వైరు మరో చివర విద్యుత్ ఉపకరణానికి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ప్లగ్‌లోని గ్రీన్ వైర్ ద్వారా ఆ విద్యుత్ ఉపకరణం భూమికి కనెక్ట్ అవుతుంది. దీనిని ఎలక్ట్రిక్ గ్రౌండింగ్ అంటారు. మూడో పిన్ లేదా ఎర్తింగ్ అనేది విద్యుత్ షాక్ నుంచి రక్షణ కల్పిస్తుంది. విద్యుత్ ఉపకరణాలను కాపాడుతుంది. విద్యుత్ ప్రవాహంలో హెచ్చు తగ్గుల నుంచి కూడా విద్యుత్ ఉపకరణాలను కాపాడుతుంది. అందుకే ఇంట్లో పెద్దపెద్ద విద్యుత్ ఉపకరణాలు ఉన్నప్పుడు గ్రౌండింగ్ తప్పనిసరిగా చేయాలి.
ఎవరు కనిపెట్టారంటే..
ఈ త్రీపిన్ ప్లగ్, సాకెట్‌ను 1904లో హార్వే హబ్బెల్ కనుకొన్నాడు. ఆతర్వాత దానిపై పేటెంట్ పొందాడు. 1915 నాటికి ప్లగ్, సాకెట్ తయారు చేసే కంపెనీలన్నీ వీటిని తయారు చేయడం ప్రారంభించాయి. బీఐఎస్ నిబంధనల ప్రకారం.. 5 యాంపియర్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే అన్ని భారీ ఎలక్ట్రానిక్ వసుత్వులకు త్రీ పిన్ ప్లగ్ వాడాలి.