Fridge: ఫ్రిజ్‌లో ఇవి అస్సలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?

చాలా మంది కొన్ని రకల ఆయిల్స్‌ అంటే కొబ్బరి, ఆలివ్, బాదం, తేనె, వెజిటేబుల్, వంట నూనెలను ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తున్నారు. ఫ్రిజ్‌లో వీటిని పెడితే గట్టిపడిపోతాయి. మళ్లీ వేడిచేసి ఉపయోగించకూడదు కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచింది.

Written By: Raj Shekar, Updated On : April 9, 2024 3:03 pm

Fridge

Follow us on

Fridge: ఫ్రిజ్ వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ఐటెమ్‌ అయినా అందులోకి వెళ్తోంది. కూరగాయలు, రకరకాల నూనెలు, పండ్లు, ఫుడ్‌ ఐటమ్స్, కూరలు, ఇలా చాలా ఫ్రిజ్‌లోకి చేరిపోతున్నాయి. ఆహారాలు నిల్వ ఉంటున్నాయి అనుకుంటున్నారు. కానీ, ఆ తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఆలోచిచండం లేదు. కొన్ని రకాల ఫుడ్‌ ఐటమ్స్‌ ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరి ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

ఆయిల్స్‌..
చాలా మంది కొన్ని రకల ఆయిల్స్‌ అంటే కొబ్బరి, ఆలివ్, బాదం, తేనె, వెజిటేబుల్, వంట నూనెలను ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తున్నారు. ఫ్రిజ్‌లో వీటిని పెడితే గట్టిపడిపోతాయి. మళ్లీ వేడిచేసి ఉపయోగించకూడదు కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచింది.

వెల్లుల్లి..
చాలా మంది వెల్లుల్లి రెబ్బలను వలిచి డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారు. వీటి వల్ల వెల్లుల్లి రుచి కల్పోతోతుంది. అంతేకాదు. అవి సాఫ్‌గా మారిపోతాయి. అందుకే వాటిని కూడా ఫ్రిజ్‌లో పెట్టకండి.

టమాటాలు, బంగాళా దుంపలు..
ఇక ఫ్రిజ్‌లో ఈ కూరగాయలు కూడా పెట్టకూడదు. పెడితే వాటి టేస్ట్‌ మారిపోతుంది. అందులో టమాటా ఒకటి. ఫ్రిజ్‌లో పెడితే రుచితోపాటు, ఆకృతి కూడా మారుతుంది. బంగాళా దుంపలను కూడా ఫ్రిజ్‌లో పెడితే అందులోని పిండి పదార్థాలు విచ్ఛిన్నం అవుతాయి.

ఉల్లిపాయలు..
కొంతమంది ఉల్లిపాయలను కూడా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దీనివలన ఉల్లిపాయల్లో తేమ పెరుగుతుంది. మెత్తగా మారతాయి. ఫ్రిజ్‌ కూడా వాసన వస్తుంది.

అరటి పండ్లు..
అరటి పండ్లను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. అందులో పెట్టడం వలన రుచి కోల్పోయి నిర్జీవంగా మారతాయి. ఫ్రిజ్‌ అంతా బనానా స్మెల్‌ వస్తుంది.

బ్రెడ్‌..
బ్రెడ్‌ని కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయకపోవడం మంచింది. ఎందుకంటే బ్రెడ్‌లో ఉండే స్టార్చ్‌ విచ్ఛిన్నం అవుతుంది. దీని వల్ల బ్రెడ్‌ త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది.