Personal Accident Insurance: అనుకోని ప్రమాదాల వల్ల మంచానికే పరిమితమైతే.. వీళ్లు వారానికి మీకు రూ. 50 వేలు చెల్లిస్తారు..

ప్రస్తుతం కాలంలో ఇన్సూరెన్స్ అనివార్యమవుతోంది. ఎందుకంటే ఒక ఉద్యోగిపై కుటుంబం ఆధారపడుతుంది. ఆ ఉద్యోగికి ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు కాపాడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ప్రమాదాల వల్ల ఒక్కోసార ఏ పని చేయడానికి వీలుండదు.

Written By: Chai Muchhata, Updated On : July 26, 2024 12:03 pm

Personal Accident Insurance

Follow us on

Personal Accident Insurance: ఒక్కోసారి అనిపిస్తుంది.. మన జీవితం మన చేతుల్లో లేదని.. ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎటువంటి తప్పు చేకపోయినా సక్రమంగా ప్రయాణం చేసినా రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోలేం. ఒక ఇంటి పెద్దకు ఇలాంటి సంఘటన ఎదురైతే అతను మాత్రమే కాకుండా అతనిపై ఆధారపడిన కుటుంబం మొత్తం బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ఉద్యోగమో, వ్యాపారమో చేసి కుటుంబాన్ని పోషిస్తున్న తరుణంలో అనుకోని ప్రమాదాలు సంభవిస్తే చాలా ఇబ్బందులకు గురవుతాయి. ఇలాంటి తరుణంలో ప్రైవేట్ ఉద్యోగి అయితే మరీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే జాబ్ చేయకుండా ఏ కంపెనీ జీతం ఇవ్వదు. పైగా నెలల తరబడి కార్యాలయానికి రాకుండా ఆ ఉద్యోగం ఉంటుందో? ఊడుతుందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు. అనుకోని ప్రమాదాల వల్ల జాబ్ చేయని పరిస్థితి ఉంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వారానికి రూ.50 వేలు చెల్లిస్తున్నాయి. అయితే ఆ ఉద్యోగి జీతాన్ని బట్టి ఈ మొత్తాన్ని ఇస్తాయి. ఇలాంటి సమాచారం తెలిసిన వారు కొందరు లైట్ గా తీసుకుంటారు. కానీ పరిస్థితిని ఎదుర్కొంటే గానీ తెలియదు.. ఎలాంటి బాధ ఉంటుందో. అందువల్ల ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలని అంటున్నారు. మరి ఈ మొత్తాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఉద్యోగి జీతంలో ఎంత వరకు చెల్లిస్తారు? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి..

ప్రస్తుతం కాలంలో ఇన్సూరెన్స్ అనివార్యమవుతోంది. ఎందుకంటే ఒక ఉద్యోగిపై కుటుంబం ఆధారపడుతుంది. ఆ ఉద్యోగికి ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు కాపాడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ప్రమాదాల వల్ల ఒక్కోసార ఏ పని చేయడానికి వీలుండదు. సాప్ట్ వేర్ ఉద్యోగులు సైతం కూర్చొని పని చేయడానికి వీలు లేదని కొందరు వైద్యులు చెబుతూ ఉంటారు. ఇలాంటి సమయంల వారానికొ కొంత ఆదాయం వస్తే ఎలాంటి సమస్య ఉండదు.

ఇప్పుడు చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇది వ్యక్తులు అనారోగ్యానికి గురైనా, ప్రమాదాలు జరిగిన ఆసుపత్రి బిల్లు నుంచి సేవ్ చేస్తుంది. కానీ ఇంట్లో ఖర్చులతో పాటు కుటుంబ అవసరాల కోసం మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి డబ్బలు రావు. ఇలాంటి సమంలో హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ‘పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ ను కూడా తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల ఉద్యోగి ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుుడు, ఎలాంటి ఆదాయం లేనప్పుడు వారానికి కొంత మొత్తం ఆదాయం చెల్లిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే?

ఒక ఉద్యోగి రోడ్డు ప్రమాదం వల్ల ఆసుపత్రిలో చేరాడు. అతని హెల్త్ కండిషన్ ప్రకారం 6 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. అయితే ఈ సమయంలో కంపెనీ సాలరీ ఇవ్వదు. దీంతో ఈఎంఐలు, ఫ్యామీలీ అవసరాలు తీరకుండా ఉంటాయి. అయితే అంతకుముందే ‘పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ ను తీసుకున్నట్లయితే మీకు వారం వారం కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే ఈ మొత్తం ఉద్యోగికి వచ్చే జీతంలో 25 శాతం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉదోగికి రూ.లక్ష జీతం ఉంటే వారానికి రూ.25 వేలు చెల్లిస్తుంది. ఒకవేళ 2 లక్షల జీతం ఉంటే రూ. 50 వేలు ఇస్తారు. అలా మొత్తం 100 వారాల పాటు చెల్లిస్తుంది. అయితే దీనికి అర్హత సాధించాలంటే ఉద్యోగికి హెల్త్ కండిషన్ పై ఆసుపత్రి నుంచి తీసుకున్న డాక్యుమెంట్ ను సబ్మిట్ చేయాలి. తనకు కంపెనీ నుంచి ఎలాంటి జీతం రావట్లేదనే ప్రూఫ్ చూపించాలి. అప్పుడే ఈ మొత్తాన్ని తీసుకోవడానికి అర్హులవుతారు.