https://oktelugu.com/

Peace: జీవితంలో మనశ్సాంతి లేదా? అయితే విముక్తి చెందండిలా!

మనస్సు సంతోషంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటారు. మరి జీవితం ప్రశాంతంగా సాగుతూ.. మనశ్సాంతి ఉండాలంటే పాటించాల్సిన ఆ నియమాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2024 / 06:02 PM IST

    enjoy

    Follow us on

    Peace: ఈ రోజుల్లో మనుషులకు ఏదైనా పెద్ద సమస్య ఉందంటే అది మనశ్సాంతి లేకపోవడమే. జీవితానికి కావాల్సిన డబ్బు, ఆహారం అన్ని కూడా మనుషులకు మనశ్సాంతి అయితే లేదు. చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా ఒత్తిడికి గురై ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎదుటి వారు చూస్తే.. అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ వారికి మనశ్సాంతి మాత్రం ఉండదు. దీనివల్ల ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉంటారు. జీవితంలో ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా జీవితం మనశ్సాంతిగా సాగుతుంది. లేకపోతే జీవితమంతా ఏదో ఇబ్బందులతోనే జీవించాల్సి వస్తుంది. మనస్సు సంతోషంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటారు. మరి జీవితం ప్రశాంతంగా సాగుతూ.. మనశ్సాంతి ఉండాలంటే పాటించాల్సిన ఆ నియమాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

    చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించకూడదు
    కొందరు ప్రతీ చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఉదాహరణకు రేపు ఆఫీస్‌‌కి ఏం బాక్స్ తీసుకెళ్లాలి? ఏం వంట చేయాలి? ఎలాంటి దుస్తులు ధరించాలని అన్ని విషయాల గురించి ఆలోచిస్తారు. ఇలా చిన్న విషయాలకి ఆలోచించడం వల్ల ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ఏం ఆలోచించవద్దు. జీవితంలో ఏం జరిగిన సంతోషంగా ముందు పోవాలని నిర్ణయించుకోండి. దీంతో మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా ఉంటుంది.

    అన్నింటికి ఎస్ కాకుండా.. నో కూడా చెప్పండి
    కొందరు ఇష్టం లేకపోయిన బయట వాళ్ల మాట వింటారు. ఇలా చేయడం వల్ల చివరికి మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అన్నింటికి ఎప్పుడు ఎస్ చెప్పకుండా అప్పుడప్పుడూ నో చెప్పడం కూడా అలవాటు చేసుకోండి. దీనివల్ల మీరు జీవితంలో సగం హాయిగా ఉంటారు. వినకపోతే ఎదుట వారు ఏం అనుకుంటారో అని మీకు మీరే ఫీల్ అయ్యి ఇష్టం లేని పనులు చేయవద్దు. ఏ పని చేస్తే మీకు నచ్చుతుందో దాని వైపు మక్కువ చూపండి.

    ఏదైనా చేయాలన్న తపన ఉండాలి
    కొందరు సంతోషంగా లేకపోయిన లైట్ తీసుకుంటారు. దీనివల్ల వారు జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని విషయాల గురించి పట్టించుకోకూడదు. అలాగే కొత్త విషయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించాలి. జీవితంలో గొప్పగా ఎదగాలంటే ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకూడదని మీకు మీరే తెలుసుకోవాలి.

    నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం
    కొందరు పాజిటివిటీ కంటే నెగిటివ్‌కి దగ్గరగా ఉంటారు. దీనివల్ల వారికి జీవితంలో అసలు మనశ్సాంతి ఉండదు. ఏ విషయంలో అయిన పాజిటివ్‌గా ఉండే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. మీ ఆలోచనలు ఎంత పాజిటివ్‌గా ఉంటే మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది.

    ఏం జరిగినా పాజిటివ్‌గానే స్వీకరించండి
    జీవితంలో మార్పులు అనేవి సహజం. ఎలాంటి పరిస్థితులు జరిగినా కూడా అన్నింటిని పాజిటివ్‌గా స్వీకరిస్తేనే ఎలాంటి బాధలు ఉండవు. చెడు జరిగిందని బాధ పడి, మంచి జరిగిందని సంతోష పడితేనే జీవితంలో మనశ్సాంతి ఉండదు.