Ration Shops: దేశంలోని ప్రజలు రేషన్ సరుకులను పొందాలంటే రేషన్ షాపుల ద్వారా పొందే అవకాశం ఉంటుందనే సంగతి తెలిసిందే. రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరకే సరుకులను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇకపై రేషన్ దుకాణాల ద్వారా ఆర్థిక సేవలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రేషన్ దుకాణాల నుంచే ఇకపై ముద్రా లోన్లను పొందే అవకాశం ఉంటుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రేషన్ దుకాణాల ద్వారా ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దేశంలోని ప్రజలు ప్రస్తుతం కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కొన్ని సేవలను పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే రేషన్ దుకాణాల దగ్గరే కామన్ సర్వీస్ సెంటర్ల సేవలు అందుబాటులో ఉండేలా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ స్వాగతం.. మీ ప్లానేంది గులాబీ బాస్..?
దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ ధరకే సరుకులను కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం నిర్ణయం వల్ల ఒకే దగ్గర రేషన్ సరుకులు పొందే అవకాశంతో పాటు ఆర్థిక సేవలను కూడా పొందే అవకాశం అయితే కలుగుతుందని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. కామన్ సర్వీసు సెంటర్ల సహాయంతో ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు బస్ టికెట్లు, రైలు టికెట్లు, ఇతర వివరాలను కూడా సులభంగా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ.. టార్గెట్ బీజేపీ..?
Recommended Video: