Parenting Mistakes: ఒకప్పటి తరానికి ఇప్పటి తరానికి ఎన్నో మార్పులు ఉన్నాయి. ఇప్పటి పిల్లలు అయితే ఇంట్లో కొంచెం కూడా పనిచేయట్లేదు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అయితే అమ్మకు ఇంటి పునల్లో, వంట పనుల్లో ఎలాంటి సహకారం అందించట్లేదు. ఎంత సేపు మొబైల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు ఇప్పటి పిల్లలు. ఇంటి ముందు వాకిలి ఊడ్చి ముగ్గులు వేయడం అంటే ఇప్పటి ఆడపిల్లలకు పెద్ద బరువు అయిపోయింది.

కనీసం ఇంట్లో పెద్దవాళ్లు తిన్న ప్లేటు కూడా తీయట్లేదు. ఇంటికి ఎవరైనా వస్తే తాగడానికి గ్లాసెడు మంచినీళ్లు కూడా ఇవ్వట్లేదు. మన ఆచార, సంప్రదాయాలను మర్చిపోతున్నారు. ఏమైనా అంటే కోపాలు, ఏడ్వడాలు వస్తున్నాయి. అంతే తప్ప మన ఆచార సాంప్రదాయాలు పాటించట్లేదు. ఇక మగ పిల్లలు అయితే చిన్న వయసులోనే పెడతోవ పడుతున్నారు. వారిని తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం వల్లనే ఇలా ఆడపిల్లలు, మగపిల్లలు దారి తప్పుతున్నారని అంటున్నారు నిపుణులు.

పిల్లలు ఇలా తయారవడానికి తల్లిదండ్రులు కూడా ఒక కారణమే. వారిని అత్యంత గారాబంగా పెంచడం వల్ల ఇలా జరుగుతోంది. మాట మాటకు ఎదురు చెబుతున్నారు పిల్లలు. చివరకు తల్లిదండ్రులను కూడా ఎదిరించే స్థాయిలో చిన్న పిల్లలు ఉంటున్నారు. అయితే వారిని కష్టపెట్టాలని ఇక్కడ చెప్పడం లేదు. వారికి జీవన విధానాన్ని నేర్పాలని, కష్టం విలువ తెలిసేలా పెంచాలని కోరుతున్నారు నిపుణులు.

పెద్ద వారికి గౌరవం ఇచ్చేలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఆడ పిల్లలకు వంటా, వార్పులు, ఇంట్లో పద్ధతులు తెలియజేస్తూ పెంచాలి. ఇక మగ పిల్లలకు అయితే ఇంట్లో చిన్న చిన్నపనులు అంటే.. కిరాణా దుకాణానికి వెళ్లి సామను తేవడం, వ్యవసాయం ఉంటే.. పొలం పనుల్లో నిమగ్నం చేయడం, తండ్రికి ఏమైనా వృత్తి పనులు ఉంటే.. వాటిని నేర్పించడం లాంటివి చేస్తే వారికి కష్టం విలువ అనేది తెలుస్తుంది.
Also Read: చినజీయర్ స్వామి చివరి ఆశా నిరాశేనా?
మన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తూ పెంచాలి. వీలైనంత వరకు మొబైల్ ఫోన్‌ను వారికి దూరంగా ఉంచాలి. జంక్ ఫుడ్ తిననివ్వకుండా.. ఇంట్లోనే రుచికరమైన వంటలు చేసిపెట్టాలి. పిల్లల మన స్థత్వాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారిలో ఏమైనా మార్పులు వస్తున్నాయంటే.. వారితో మనసు విప్పి మాట్లాడాలి. పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మనతో పంచుకునేంత స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి.
వారి ఆలోచనలకు గౌరవం ఇవ్వాలి. అప్పుడే వారు మనకు అన్నీ చెబుతారు. వారు ఏం చెప్పినా దాన్ని మనం ఓపిగ్గా వినాలి. అందులో అవసరమున్న వాటిని అమలు చేయాలి కూడా. తప్పేదో, ఒప్పేదో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇలా అన్ని గుణ గణాలను వారికి నేర్పించినప్పుడే.. వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించిన వారం అవుతాం. అంతే కాకుండా.. ఈ మధ్య చిన్న వయసులోనే వస్తున్న రోగాలను కూడా వారి దరి చేరనీయకుండా చూసిన వారం అవుతాం.
Also Read: జాతీయ రాజకీయాల కోసం ఈసారి ఎంపీగా పోటీ చేయనున్న కేసీఆర్ !?
Recommended Video:
