Railway Jobs: నార్త్ ఈస్టర్న్ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. గోరఖ్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గ్రూప్ సీ పోస్టులను రైల్వే శాఖ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమైంది.

రెజ్లింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ తో పాటు బాస్కెట్ బాల్, హాకీ, వాలీవాల్, క్రికెట్, కబడ్డీ కోటాలో కామన్‌వెల్త్ గేమ్స్, ఛాంపియన్స్ ట్రోపీ, ఒలంపిక్ గేమ్స్, వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ లలో పాల్గొన్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
Also Read: MLA Rajaiah: మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య?
సాధించిన పతకాలు, విద్యార్హతలు, ఫీల్డ్ ట్రయల్స్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలు కాగా జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుంది.
2022 సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://ner.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు చేకూరుతోంది.
Also Read: Janasena Party: జనసేనలోకి ఆ రెండు పార్టీలు.. ఏపీ భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ యేనా?