Naga Chaitanya With Nandini Reddy: నాగచైతన్య తన తర్వాతి ప్రాజెక్ట్‌ను సమంత బెస్ట్‌ఫ్రెండ్, డైరెక్టర్ నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించనుందట. ఈ సినిమాను నాగచైతన్య, సమంతతో తీయాలని గతంలో నందినీరెడ్డి ప్లాన్ చేసినా.. వారి విడాకులతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి. మరి ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
Naga Chaitanya, Nandini Reddy
మరోపక్క విడాకులు తర్వాత సమంత సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్‌పై నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చాలా బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు సమంత ఇన్‌స్ట్రాగ్రామ్‌ను వేదికగా మలుచుకుంటున్నాయి. దీంతో తను పెట్టే ప్రతి పోస్ట్‌కు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సామ్ డిమాండ్ చేస్తోందని సమాచారం. ఇక ఫొటోషూట్స్, వీడియోలకు అదనంగా 2-3 రెట్లు తీసుకుంటుందట సమంత.
Also Read: Alia Bhatt Unfollowed Rajamouli On Instagram: ‘ఆలియా – రాజమౌళి’ మధ్యలో ఏం జరిగింది ?
పైగా సమంత మంచి వ్యాపారవేత్తగా కూడా రాణించాలని ఆశ పడుతుంది. అందుకే, తను సంపాదిస్తున్న డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడుతుంది. రీసెంట్ గా సామ్ ఓ ఈ-కామర్స్ సైట్ లో వ్యాపార భాగస్వామిగా జాయిన్ అయిన సంగతి తెలిసిందే. సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీలో సమంత పెట్టుబడులు పెట్టింది. పైగా ఈ సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీకి సామ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండనుంది.
Naga Chaitanya, Nandini Reddy
గతేడాది జనవరిలో లాంచ్ చేసిన ఈ కంపెనీలో పర్యావరణ సహిత వస్తువుల్ని మాత్రమే అమ్ముతారు. అలాగే దుస్తులు, ఇంటీరియర్ డెకరేషన్ నుంచి హెల్త్ ప్రాజెక్టులతో పాటు అనేక సౌందర్య ఉత్పత్తులు.. ఇలా ఎన్నో రకాల ఉత్పత్తుల్ని ఈ సైట్ లో అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తానికి సమంత వ్యాపారంతో పాటు వరుసగా సినిమాలను ఓకే చేసేస్తోంది.
Also Read: KGF Chapter 2 Trailer Records: రికార్డుల మోత మోగిస్తున్న `కేజీఎఫ్ 2` ట్రైలర్