Snake Bite Remedy: పాము అంటే ఎవరికైనా భయమే. దానిని చూస్తే చాలు వణికిపోతూ ఉంటారు. కానీ గ్రామాల్లో కొందరు ప్రతిరోజు పాములను చూస్తూ ఉంటారు. వీటిని చూడగానే భయం వేయకపోయినా.. అవి వేసే కాటువల్ల ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. పాము కాటు వేయగానే ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స చేస్తూ ఉంటారు. ఈ ప్రథమ చికిత్స వల్ల శరీరంలోకి విషం ఎక్కకుండా కాపాడుకోవచ్చు. అయితే ఈ ప్రథమ చికిత్స సాధారణంగా కాకుండా ఆయుర్వేద వైద్యంతో చేయడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. గ్రామాల్లో కనిపించే కొన్ని మొక్కల వల్ల పాము కాటు వేసినా తొందరగా విషం ఎక్కకుండా కాపాడుతుంది అని అంటున్నారు. ఇంతకు ఆ మొక్క లేదంటే?
Also Read: రాత్రిళ్ళు పదే పదే మూత్రం వస్తుందా?
గ్రామాల్లో నిత్యం పాములు తిరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉండేవారు వీటి నుంచి కాపాడుకునేందుకు అనేక రకాలుగా రక్షణ చర్యలు వాడుతూ ఉంటారు. కొందరు ముందు జాగ్రత్తగా గ్రామాల్లో పాము విషం విరుగుడు కి అవసరమైన ఆయుర్వేద మందులను అందుబాటులో ఉంచుకుంటారు. అయితే ప్రతి గ్రామంలో కనిపించే ఈ మొక్క వల్ల పాము కాటు విషాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఆ మొక్క పేరు కాకోరా. దీనినే కొన్ని ప్రాంతాల్లో కాంటోలా అని అంటున్నారు. అయితే ఇది దాదాపు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ దీని గురించి తెలిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు అని కొందరు ఆయుర్వేదిక వైద్యులు అంటున్నారు.
పురాతన ఆయుర్వేదిక జ్ఞానం ప్రకారం.. కాకోరాలో ఉండే గుణాలు పాము కాటు విషం ఎక్కకుండా కాపాడుతాయి. దీనిని తీసుకోవడం వల్ల ఐదు నిమిషాల్లోనే ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. మరి పాము కాటు వేసినప్పుడు దీనిని ఎలా ఉపయోగించాలి? ఒక వ్యక్తికి పాము కాటు వేసినప్పుడు కాకోరా తో తయారుచేసిన పొడిని పాలలో వేసుకొని తాగాలి. ఇది తాగిన తర్వాత వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాలి. చాలావరకు పాము కాటు వేయగానే వెంటనే శరీరంలోకి విషం వెళుతుంది. కానీ కాకోరా తీసుకోవడం వల్ల పాము విషం శరీరంలోకి వేగంగా వెళ్లడాన్ని అడ్డుకుంటుంది.
Also Read: 18 ఏళ్లు నిండిన వారిలో ఈ సమస్యలు.. ఎందుకో తెలుసా?
చాలా గ్రామాల్లో కాకోరా ముందు జాగ్రత్తగా అందుబాటులో ఉంచుకుంటారు. ఇది కాయల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. దీనిని తీసుకువచ్చి పొడిలా తయారు చేయాలి. ఆ తర్వాత దీనిని స్టోర్ చేసుకొని.. ప్రమాద సమయంలో ఉపయోగించడం వల్ల కొంత వరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఈ కాకోరా పొడి వల్ల కేవలం ప్రాథమిక చికిత్స కు మాత్రమే పనిచేస్తుంది. వైద్య చికిత్స అందే వరకు విషం వేగంగా వెళ్లకుండా కాపాడుతుంది. ఈ పొడిని తీసుకొని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. ఆస్పత్రి వైద్యానికి ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పాము కాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. పొలాలలో పనిచేసే రైతులు, ఇతరులు ముందు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాలని చెబుతున్నారు.