Healthy Lifestyle Tips: ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పేవారు. ఎందుకంటే ఈ వయసులో ఉన్న వారి ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి తగ్గుతుంది. రక్త ప్రసరణ కూడా నెమ్మదిస్తుంది. అంతేకాకుండా ఈ వయసులో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చిన గుండెపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తాయి. కానీ నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండిన వారిలో గుండెపోటు, డయాబెటిక్ వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అయితే అందుకు వాతావరణం లో ఉన్న కలుషితంతో పాటు కొన్ని అలవాట్ల వల్ల అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే ఆయుష్షు పెంచుకోవచ్చని అంటున్నారు. ఇంతకీ ఎటువంటి అలవాట్ల వల్ల ఈ పరిస్థితి వస్తుంది?
Also Read: ఉపవాసం ఎందుకు ఉండాలి? అనేది పులి, చిరుత పులి చెబుతుంది.. ఎలాగో తెలుసుకోండి..
నేటి కాలం యువత లో కొంతమంది చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. వీటిలో ధూమపానం ఒకటి. ధూమపానం వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం లేకున్నా.. కేవలం సరదా కోసం మాత్రమే దీనికి అలవాటు అవుతున్నారు. అయితే కొందరు మత్తుగా ఉండాలని అనుకుంటూ బానిసగా మారిపోతున్నారు. ఇది మొదట్లో అలవాటుగా ఉండి.. ఆ తర్వాత అది లేకుంటే జీవితమే లేదు అనే పరిస్థితికి వస్తుంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు ఏర్పడి.. శ్వాస కోసం ఇబ్బందులు ఏర్పడతాయి. ఫలితంగా గుండెకు సరైన రక్త ప్రసరణ లేకుండా గుండెపోటుకు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇంట్లో రుచికరమైన ఆహారం ఉన్నా.. బయట ఫుడ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కొందరు యువత. కొత్త రకం టేస్టీ చూడాలని అనుకుంటూ.. రోస్టెడ్ ఫుడ్ పేస్ట్ అని అనుకుంటూ వాటిపైనే ఇష్టం పెంచుకుంటున్నారు. అయితే ఫాస్ట్ ఫుడ్ రెగ్యులర్ గా తినడం వల్ల కొవ్వు పేరుకు పోతుంది. రక్తనాళాల్లో ఇది ఎక్కువగా ఉండటం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. ఈ ప్రభావం గుండెపై పడుతుంది. ఫలితంగా గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వయసుతో సంబంధం లేకుండా నీటి కాలంలో చాలామంది 18 ఏళ్లకే డయాబెటిక్ వ్యాధి బారిన పడిపోతున్నారు. అయితే చిన్నప్పటి నుంచే చాక్లెట్స్ ఎక్కువగా తినేవారు.. తీపి పదార్థాలపై ఎక్కువగా మక్కువ పెంచుకున్న వారు.. ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కొందరు వారసత్వంగా ఈ వ్యాధి లేకున్నా కూడా వారు తినే ఆహార పదార్థాల కారణంగా శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే అనేక రకాల మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది.
ఇక కొంతమంది అయితే వీకెండ్ లో మద్యం కి అలవాటు పడిపోతున్నారు. సమయం సందర్భం లేకుండా మద్యం తాగడంతో వీటికి కొందరు కుబానిస గా మారిపోతున్నారు. అయితే ఆ తర్వాత మానసిక సమస్యలు ఎదుర్కొంటూ ఫలితంగా గుండె సమస్యలను తెచ్చుకుంటున్నారు.
Also Read: ప్రేమ భాషలు అంటే ఏమిటి?
అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. చదువులో లేదా ఏదైనా సమస్య వస్తే వెంటనే తల్లిదండ్రులు లేదా సమీప గురువులను ఆశ్రయించి సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి. అంతేకానీ ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.