Urinary Health Problems: శరీరంలో 70% వరకు నీరు ఉంటుంది. ఇది తగ్గినప్పుడల్లా దాహం వేస్తూ ఉంటుంది. అయితే కొందరు పనులు లేక ఇతర కారణాలవల్ల సరైన నీటిని తీసుకోరు. దీంతో డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటారు. అలాగే వేసవికాలంలో శరీరం నుంచి చెమట ద్వారా నీరు అధికంగా బయటకు పోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో కూడా సరైన మీరు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అయితే వర్షాకాలం లేదా చలికాలంలో శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే ఎక్కువగా మూత్రం వస్తూ ఉంటుంది. కానీ కొందరిలో ఎలాంటి వాటర్ తీసుకోకపోయినా పదేపదే మూత్రం చేయాల్సి వస్తుంది. ఇక రాత్రిలో అయితే విపరీతంగా మూత్రం రావడానికి కారణాలు ఏంటో తెలుసా?
Also Read: పండగ ఆఫర్.. కొత్త జుట్టు మొలుస్తుందని వెళ్తే.. వున్న జుట్టు కూడా పాయె!
సాధారణంగా అవసరానికంటే ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఎలాంటి నీరు తాగకపోయినా మూత్రం పదేపదే రాత్రిళ్ళు వస్తుందంటే అందుకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లేనని గుర్తించాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమయంలో మూత్రం మంటగా వస్తుంది. అయితే ఇది పదేపదే రావడం ఇబ్బంది పెడుతుంది. ఇలా మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నవారికి పదేపదే రాత్రిళ్ళు మూత్రం వస్తూ ఉంటుంది.
ప్రస్తుత కాలంలో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు పెరుగుతూ ఉన్నారు. ఈ వ్యాధి రాబోతుందని తెలియజేయడానికి పదేపదే మూత్రం వస్తూ ఉంటుంది. రాత్రిళ్ళు నీరు తాకపోయినా మూత్రం వస్తుంది అంటే దానికి అర్థం డయాబెటిక్ లక్షణమే అని గుర్తించాలి. ఈ సమస్య ఉన్నవారు ముందుగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. అప్పటికి ఏమి తేలకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది.
కొందరిలో పై రెండు సమస్యలు మాత్రమే కాకుండా యూరిన్లో బ్లడ్ రావడం వంటిది ఉంటాయి. శరీరంలో అనేక రకాల సమస్యలు ఏర్పడి ఇలా యూరిన్ ద్వారా బ్లడ్ వెళ్తూ ఉంటుంది. దీనిని తీవ్రమైన సమస్యగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. మూత్రపిండాల్లో సమస్య ఉన్నవారికి కూడా ఇలా మూత్రంలో బ్లడ్ వస్తూ ఉంటుంది.
రాత్రిళ్ళు పదేపదే మూత్రం రావడానికి పురుషుల్లో ప్రొస్టేట్ అనే గ్రంధి పెద్దగా అయినప్పుడు కూడా పదేపదే మూత్రం వస్తు ఉంటుంది. అయితే పదేపదే మూత్రం వచ్చినవారు షుగర్ టెస్ట్ లో ఏమీ తేలేక పోతే ఆ తర్వాత ఈ సమస్య గురించి కూడా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.
Also Read: 18 ఏళ్లు నిండిన వారిలో ఈ సమస్యలు.. ఎందుకో తెలుసా?
ఇవే కాకుండా లైంగిక సమస్యలు ఉన్నవారిలో కూడా మూత్రం పదేపదే వస్తూ ఉంటుంది. కొందరు దీనిని చాలా తేలికగా తీసుకుంటారు. కానీ ఒక్కోసారి కిడ్నీ లో ఉండే సమస్యల వల్ల కూడా ఇలా మూత్రం అధికంగా వస్తుంది. దీనిని నిర్లక్ష్యంగా చేస్తే కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంటుంది. మూత్రం సరఫరా చేసే కిడ్నీలోనే సమస్య ఉంటే ఇలా అధికంగా వస్తూ ఉంటుంది. అందువల్ల అధికంగా మూత్రం వస్తున్నావారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమస్య పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించాలి.