Power Star Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేసేలా ఆయన సినిమాలు చేస్తున్నాడు… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తూ వచ్చాయి. అలాగే తన అభిమానులను విపరీతంగా అలరించాయి. మరి అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే సగటు ప్రేక్షకులందరు ఆ సినిమాకోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు… ఇక చాలామంది హీరోలు అతని అభిమానులమని చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నితిన్ లాంటి హీరో కూడా ఇష్క్ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా పిలిపించి అతని చేతుల మీదుగా ఆడియో రిలీజ్ అయితే చేశారు. దాంతో ఆ ఆడియోకి మంచి రీచ్ అయితే లభించింది. ఇక సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించింది. అదే సందర్భంలో నితిన్ సైతం తను పవన్ కళ్యాణ్ అభిమానిని చిన్నప్పటి నుంచి అతని సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పాడు.
Also Read: ‘అతడు’ రీ రిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్..కానీ ఆ దేశంలో ఇండస్ట్రీ హిట్!
మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రం నితిన్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ కి లభించలేదు. పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల గత వైసిపి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది. తక్కువ రేట్ కి టికెట్లను అమ్ముతూ ఎప్పటికీ అతని సినిమా బాలేదు అంటూ ప్రచారం చేసినా కూడా ఎవరు ఎలాంటి స్పందన ను తెలియజేయలేదు.
ఇక దాంతో పాటుగా మరి కొంతమంది హీరోలు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులం అంటూ చెప్పుకొని ఇండస్ట్రీలో చాలామణి అవుతున్నారు… అయినప్పటికి పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరి సినిమాలు చూస్తున్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సపోర్ట్ ని ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం నితిన్ లాంటి హీరోల మీద ఫైర్ అవుతున్నారు.
Also Read: వార్ 2 vs కూలీ సినిమాల్లో ఏ మూవీ హిట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ప్లస్…
మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ లో రాణించడానికి పెద్ద హీరోల సపోర్ట్ అనేది చాలా వరకు ఉండాలి. దానివల్లే సినిమాల్లో అవకాశాలు గాని, సినిమా లకు ఎక్కువ రీచ్ అయితే దొరుకుతోంది అందుకే యాంగ్ హీరోలు స్టార్ హీరోల అభిమానులని చెబుతారు అంటూ చాలామంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక నితిన్ సైతం తన సినిమా కెరియర్ కోసమే పవన్ కళ్యాణ్ పేరును వాడుకున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం…