Maida Unhealthy: మనం బతకడానికి రోజు ఆహారం తీసుకుంటాం. కానీ అందులో పోషకాలు ఉన్నాయో లేదో మాత్రం చూసుకోం. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మనం తినే ఆహారంలో ప్రొటీన్లు ఉన్నాయో లేవో పరీక్షించుకోవాలి. అప్పుడే మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో ఎక్కువగా మైదా పిండిని వినియోగిస్తున్నారు. దీంతో రకరకాల వంటలు చేసుకుని తింటూ భలే రుచిగా ఉన్నాయని ఆస్వాదిస్తున్నా దాంతో వచ్చే అనర్థాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా మన శరీరం గుల్ల కావాల్సిందే. తస్మాత్ జాగ్రత్త. మైదాపిండిని వాడుతున్నారా? ఆలోచించండి. దాంతో ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి.

గోధుమ పిండి నుంచి వచ్చిందే కదా మైదాను ఎందుకు వాడొద్దంటున్నారంటే చక్కెర కూడా చెరుకు నుంచే వస్తుంది. కానీ చెరుకును మరిగిస్తే బెల్లం వస్తుంది. ఆ బెల్లాన్ని మరిగిస్తే చక్కెర వస్తుంది. అంటే రెండు సార్లు ఉడికించి తీయడం వల్ల అందులో పోషకాలు నశిస్తాయి. అందుకే చక్కెర తినొద్దని చెబుతారు. అలాగే గోధుమలను పట్టిస్తే గోధుమ పిండి వస్తుంది. దాన్ని మళ్లీ మర వేస్తే మైదా వస్తుంది. ఈ ప్రాసెస్ లో ఎన్నో రసాయనాలు కలవడం వల్ల మైదా మనకు హానీ చేసే పిండిగా గుర్తిస్తున్నాం.
మైదాపిండిలో బెంజాయిల్ పెరాక్సైడ్ తోపాటు ప్రమాదకరమైన రసాయన పదార్థం అలోక్సెడ్ కలుపుతారు. దీంతో మన శరీరానికి హాని కలుగుతుంది. బెంజాయిల్ పెరాక్సైడ్ చైనా తోపాటు యూకే, యూరోపియన్ దేశాలు నిషేధించాయి. కానీ మన దేశం మాత్రం ఇంకా నిషేధించకపోవడం తెలిసిందే. దీంతో మైదాపిండి వాడకం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మైదాపిండితో చేసిన పదార్థాలు తింటే కడుపు నిండినా పోషకాలు మాత్రం సున్నా. దీంతోనే దీని వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సూచిస్తున్నారు.

ఇది రక్తంలో చక్కర నిల్వలు పెరిగేలా చేస్తుంది. దీంతో మధుమేహులకు అనారోగ్యమే. అందుకే బేకరీ ఫుడ్స్ తినకపోవడడమే శ్రేయస్కరం. శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తుంది. ఫలితంగా గుండెజబ్బులు లాంటివి రావొచ్చు. శరీరంలో ఎముకలు కూడా గుల్లబారుతాయి. మైదాపిండితో ఇన్ని అనర్థాలున్నా రుచికరంగా ఆస్వాదిస్తూ తినేవారు ఉండటం తెలిసిందే. మైదాకు బదులు బాదం, కొబ్బరి, వోట్స్, బెల్లం, రాగి తదితర వాటిని వాడుకోవచ్చు. మైదాను మాత్రం దూరం పెట్టడమే మనకు మంచిది. అందుకే మైదాను వాడకండి. ఆహార పదార్థాల్లో దాని ప్రభావం ఉండకుండా చూసుకుంటేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని గుర్తుంచుకోండి.
Also Read:Punugu Pilli Tailam: తిరుమల శ్రీవారికి పునుగుపిల్లి తైలంతో ఏం చేస్తారు? అసలేంటి కథ?