Tollywood Heroes Disaster Movies: తెలుగు సినీ పరిశ్రమలో చాలా రకాల సినిమాలుంటాయి. కొన్ని బ్లాక్ బస్టర్ అయితే ఇంకొన్ని అంతే స్థాయిలో పాపులర్ అవుతాయి. వీటిలో ఎందుకు నటించామురా దేవుడా అని బాధపడుతుంటారు మన హీరోలు. అలాంటి సినిమాలు తలుచుకున్నప్పడల్లా ఏదో తెలియని బాధ వారిని ఇబ్బంది పెట్టడం మామూలే. అలాంటి సినిమాలు మన తెలుగులో కూడా ఉన్నాయి. స్టార్ హీరో నుంచి కింది స్థాయి వరకు కూడా ఎందరివో సినిమాలు ప్లాప్ అయినవి కొన్ని ఉండటం తెలిసిందే.
తమ కెరీర్ ను దెబ్బతీసిన సినిమాల గురించి ఇప్పటికి తలుచుకుని విచారం వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఈ కోవలో మెగాస్టార్ చిరంజీవి, రోజా జంటగా నటించిన చిత్రం బిగ్ బాస్. ఎన్నో అంచనాలతో విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశపరచింది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, జగదేవకవీరుడు అతిలోక సుందరి వంటి హిట్లతో ముందంజలో ఉన్న మెగాస్టార్ కు తీరని నష్టాన్ని మిగిల్చిన సినిమా కావడం తెలిసిందే. అందుకే ఈ సినిమా గురించి మాట్లాడేందుకు కూడా చిరు ఇష్టపడరు. ఇప్పుడు చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా నిరాశపరడంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు.
Also Read: Sudigali Sudheer: జబర్దస్త్ లోకి సుడిగాలి సుధీర్ రీఎంట్రీ.. కారణం ఎవరో తెలుసా ?
ఇక బాలయ్య చిత్రాలు బాక్సాఫీసు బొనాంజాలు కావడం తెలిసినా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చిన సినిమాలుండటం సాధారణమే. ఆయన ఎప్పుడు చెబుతుంటారు. తనకు విషాదాన్ని మిగిల్చిన సినిమా ఒక్కమగాడు. ఈ సినిమా చేయాల్సింది కాదు అంటారు. తరువాత దాసరి దర్శకత్వంలో వచ్చిన పరమవీర చక్ర, అధినాయకుడు చిత్రాలు కూడా నిరాశ పరచాయి. దీంతో ఆయన వాటి గురించి ఎక్కువగా మాట్లాడరు. తనకు కలిసి రాని సినిమాలు చేయడం నిరాశే మిగిల్చిందని బాధ పడుతుంటారు.
మరో నటుడు వెంకటేశ్. ఆయనకు కూడా కలిసి రాని చిత్రాలు ఉన్నాయి. ఆయన నటించిన చిత్రాల్లో అత్యంత ప్లాపయిన చిత్రం షాడో. దీంతో ఆయన ఆ సినిమా పేరు వింటేనే భయపడతారు. అంతటి నష్టం మిగిల్చిన సినిమా కావడంతో దాని గురించి ఎక్కడ కూడా చర్చించరు. నాగార్జునకు కూడా రెండు సినిమాలు తేడా కొట్టాయి. అవి భాయ్, ఆఫీసర్ సినిమాలు. దీంతో ఆయన కూడా వాటి పేరు చెప్పడానికి ఇష్టపడరు. హీరోలకు కూడా భయపడేంత స్థాయిలో ఆ సినిమాలు ఉండటం గమనార్హం.
ప్రభాస్ కాజల్ జంటగా వచ్చిన సినిమా రెబల్. ఇది కూడా ప్రేక్షకులను నిరాశపరచింది. రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కూడా ప్లాప్ వరుసలో చేరింది. అల్లు అర్జున్ నటించిన వరుడు, రాంచరణ్ హీరోగా వచ్చిన తుఫాన్, మహేశ్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం, వరుణ్ మిస్టర్, జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమాలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ఎన్నో ఊహలతో ఎన్నో అంచనాలతో తీసినా కొన్ని సినిమాలు ఎందుకో గానీ హిట్ కావు. దీంతో హీరోలకు నిరాశే మిగులుతుంది. ఎంతో శ్రమకోర్చి దాదాపు మూడు నెలలు కష్టపడి తీసిన సినిమా ప్లాక్ కావడం అంటే మన కష్టం బూడిదలో పోసిన పన్నీరే.
దీంతో సినిమాల నిర్మాణంలో జాగ్రత్తగా ఉండాలని చూస్తుంటారు. అలాగే చర్యలు కూడా తీసుకుంటారు. కానీ ఎక్కడో తేడా కొట్టి సినిమా బోల్తా కొడుతుంది. ప్రేక్షకులకు సైతం నిరాశే మిగుల్చుతాయి. హీరోల కెరీర్ కు కూడా ముళ్లబాటలు వేస్తాయి. ఇలాంటి సినిమాల వల్ల అటు హీరోలు, ఇటు దర్శకులు, నిర్మాతలు కూడా నష్టపోతుంటారు. పెట్టిన పెట్టుబడి రాక దివాళా తీసిన వారు ఎందరో ఉండటం గమనార్హం. ఎవరికి ఏం కాకపోయినా నిర్మాత మాత్రం నిలువునా మునగడం ఖాయం. అందుకే సినిమాల విషయంలో దర్శకులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి అంచనాలు తప్పడం సినిమాలు బోల్తా పడటం మామూలే.
Also Read:Hero Siddharth: హీరో సిద్ధార్థ్ ప్రేమలో పడి నిండా మునిగిన హీరోయిన్లు వీరే