Breakfast cooking gas saving tips: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధం జరిగేది రెండు మధ్య అయినా.. ఈ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై పడుతుంది. ముఖ్యంగా చమురు సరఫరాపై ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. తమరు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో దీని ఆధారిత వ్యవస్థలు దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చమరుద్వారా ఉత్పత్తి అయ్యే గ్యాస్ సరఫరాపై ఆందోళన ఉండడంతో వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా భారత్ లో కూడా గ్యాస్ సిలిండర్లా కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగం తగ్గించుకోవడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవడంలో భాగంగా బ్రేక్ ఫాస్ట్ లో చిన్న మార్పులు చేసుకుంటే గ్యాస్ చాలా వరకు ఆదా చేసుకోవచ్చని అంటున్నారు. ఆ మార్పులు ఏవో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ప్రతి ఇళ్లల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం దోష, ఇడ్లీ, పూరి, వడ వంటి వంటకాలు చేస్తుంటారు. వీటిని తయారు చేయడానికి గ్యాస్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ ను ఆదా చేయడానికి ఈ వంటకాలకు బదులు తక్కువగా గ్యాస్ అవసరమయ్యే వాటిని తయారు చేసుకోవాలని అంటున్నారు. అయితే పూర్తిగా గ్యాస్ లేని వాటిని కూడా బ్రేక్ ఫాస్ట్ గా ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిది అని తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఉదయం అల్పాహారంగా సులభంగా తయారయ్యే కొన్ని ఆహార పదార్థాలను తయారు చేసుకోవాలని అంటున్నారు. వీటిలో వెజిటేబుల్ సలాడ్స్, శాండ్విచ్, మొలకలు, మిక్స్డ్ ఫ్రూట్స్ వంటివి తయారు చేసుకోవచ్చని అంటున్నారు. వీటి వల్ల శరీరానికి ప్రోటీన్లు అందించడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
Also Read: రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యకరం? తక్కువైనా.. ఎక్కువైనా.. ఎలాంటి సమస్యలు?
అలాగే ఉదయం త్వరగా బ్రేక్ఫాస్ట్ కావాలని అనుకునే వారికి బ్లడ్ పై జామ్ లేదా పీనట్ బట్టర్ రాసుకొని తినడం కూడా బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారని చెబుతున్నారు. ఈ పదార్థాలు తయారు చేయడానికి ఎలాంటి గ్యాస్ అవసరం ఉండదని చెబుతున్నారు. వీటితోపాటు ప్రస్తుతం వేసవి ఉన్నందున ఫ్రూట్ జ్యూస్, మిత్రుడు ఫ్రూట్ జ్యూస్ వంటివి కూడా బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఆపిల్, మా నాన్న, ద్రాక్ష పండ్లను కలిపి జ్యూస్ తయారుచేసుకొని ఉదయం తీసుకుంటే బ్రేక్ ఫాస్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
అయితే ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేసుకోవాలని అనుకునేవారు గ్యాస్ కు బదులు ఇండక్షన్ స్టవ్ ఉపయోగించడం మేలని అంటున్నారు. వీటికి ఎక్కువగా పవర్ అవసరం ఉంటుంది. గ్యాస్ వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ దాదాపుగా వీటి అవసరం లేకుండా ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ తీసుకోవడమే మేలు అని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు.