ఆస్తికి యజమాని అయిన వాళ్లకు ఆస్తి పత్రాలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది బ్యాంకు లాకర్లలో ఆస్తికి సంబంధించిన పత్రాలను ఉంచుతారు. ఆస్తి పత్రాల సహాయంతో ఆస్తికి యజమాని మీరే అని నిరూపించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆస్తి పత్రాలను పోగొట్టుకుంటే క్రయవిక్రయాలు జరిపే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాంకు నుంచి రుణం పొందడం కూడా సాధ్యం కాదు.
ఆస్తి పత్రాలను పోగొట్టుకున్న వాళ్లు తక్షణమే డూప్లికేట్ డాక్యుమెంట్లను తయారు చేసుకోవడం ద్వారా సమస్యను సులభంగా అధిగమించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆస్తి పత్రాలు పోగొట్టుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఐఆర్ లో పేపర్లు పోయాయన్న కాపీని మీ దగ్గరే ఉంచుకోవాలి. ఆ తర్వాత వార్తాపత్రికలో పోగొట్టుకున్న కాగితానికి సంబంధించిన నోటీసులను ఇవ్వాలి.
ఈ నోటీసు ద్వారా డూప్లికేట్ షేర్ పత్రాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎఫ్‌ఐఆర్ కాపీని, వార్తాపత్రికలో ముద్రించిన నోటీసు క్లిప్పింగ్‌ను అందించి డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్ ను పొందవచ్చు. ఈ సంఘటన నిజమని తేలితే షేర్ సర్టిఫికెట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తప్పిపోయిన పేపర్లు, ఎఫ్‌ఐఆర్, వార్తాపత్రిక నోటీసులను స్టాంప్ పేపర్ పై పేర్కొని రిజిస్ట్రార్ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
నకిలీ సేల్ డీడ్ తో ఆస్తి పత్రాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. కొంత రుసుమును చెల్లించి సులభంగా డూప్లికేట్ సేల్ డీడ్ ను పొందే అవకాశం ఉంటుంది. ఆస్తి పత్రాలను పోగొట్టుకున్న వాళ్లు ఏ మాత్రం కంగారు పడకుండా ఈ విధంగా డూప్లికేట్ సేల్ డీడ్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.