Jagan Pawan: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. దెబ్బకు ‘రోడ్డు’పై పడ్డ జగన్

Jagan Pawan: జనసేనాని పవన్ కళ్యాణ్ దెబ్బకు ఏపీ సర్కార్ దిగివచ్చింది. దెబ్బకు రోడ్డుపై జగన్ పడ్డాడు. వెంటనే ఏపీలో వర్షాలకు దెబ్బతిన్న 46వేల కి.మీల రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించారు. వెంటనే ఈ రోడ్ల మరమ్మతులు ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలోని రోడ్ల దుస్థితిపై పోరుబాట పట్టారు. స్వయంగా ఉత్తరాంధ్ర, అనంతపురంలలో శ్రమదానం చేసి రోడ్లను బాగు చేశారు. అప్పుడే ఏపీ ప్రభుత్వం రోడ్లను బాగు చేయాలని […]

Written By: NARESH, Updated On : November 15, 2021 10:02 pm
Follow us on

Jagan Pawan: జనసేనాని పవన్ కళ్యాణ్ దెబ్బకు ఏపీ సర్కార్ దిగివచ్చింది. దెబ్బకు రోడ్డుపై జగన్ పడ్డాడు. వెంటనే ఏపీలో వర్షాలకు దెబ్బతిన్న 46వేల కి.మీల రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించారు. వెంటనే ఈ రోడ్ల మరమ్మతులు ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

YS-Jagan-Andhra-Pradesh-Roads

ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలోని రోడ్ల దుస్థితిపై పోరుబాట పట్టారు. స్వయంగా ఉత్తరాంధ్ర, అనంతపురంలలో శ్రమదానం చేసి రోడ్లను బాగు చేశారు. అప్పుడే ఏపీ ప్రభుత్వం రోడ్లను బాగు చేయాలని లేదంటే పోరుబాట తప్పదని హెచ్చరించారు. అప్పుడే చేస్తే క్రెడిట్ పవన్ కు వస్తుందని ఆగిన సీఎం జగన్ తాజాగా గ్యాప్ ఇచ్చి ఆదేశాలిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 46వేల కి.మీల మేర రోడ్ల మరమ్మతులు చేపట్టాలని.. విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రోడ్ల ప్రాజెక్టులు తీసుకొని ప్రారంభించని కాంట్రాక్టులను బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

అన్నింటికంటే ముందుగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన రాష్ట్రంలోని రహదారులపై గుంతలు పూడ్చి వేయాలని.. ఆ తర్వాత కార్పెంటింగ్ చేయాలని జగన్ ఆదేశించారు. అన్ని రోడ్ల మీద అన్ని చోట్ల గుంతలు పూడ్చాలని కోరారు. ఈ మేరకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

ఏపీ వ్యాప్తంగా ఏకంగా 46వేల కి.మీల రహదారులకు మరమ్మతులు చేయాలని జగన్ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ యేనని.. ఆయన ఆందోళనతోనే ఏపీకి మోక్షం వచ్చిందని చర్చ సాగుతోంది.