Mahesh Allu Arjun Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్పుడూ హిట్ కొట్టిన దర్శకులతో వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. తమకు హిట్ అందించిన దర్శకుడితోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హిట్ ఫార్ములాను కంటిన్యూ చేయడానికి ఆరాటపడుతున్నారు. ఇలా సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హీరోల్లో మహేష్ బాబు, అల్లు అర్జున్, బాలక్రిష్ణ ఉన్నారు.

ఒకసారి కాదు.. రెండు సార్లు.. మూడు సార్లు ఒకే దర్శకుడితో చేయడానికి మన స్టార్ హీరోలు సై అంటుండడం విశేషం. ఇందులో బాలకృష్ణ, మహేష్, అల్లు అర్జున్ లు ముందు వరుసలో ఉన్నారు.
బాలయ్య వరుసగా మూడో సినిమా ‘అఖండ’ను దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తీశాడు. ఇక అల్లు అర్జున్ కూడా తనకు రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ తో ముచ్చటగా మూడో సినిమా ‘పుష్ప’ను తీస్తున్నాడు.
ఇక స్టార్ హీరో మహేష్ బాబు సైతం చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ మూవీని పట్టాలెక్కించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘అతడు’, ఖలేజా అలరించాయి. ఇప్పుడు మూడో సినిమా ఏ జోనర్ లో ఉంటుందో చూడాలి.
ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఇది నాలుగో మూవీ. ఇక కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో కూడా మూడో మూవీ రాబోతోంది. రాజమౌళితో రాంచరణ్ రెండో మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నాడు.
టాలీవుడ్ అగ్రహీరోలందరూ తమకు గతంలో భారీ హిట్స్ ఇచ్చిన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వీళ్ల బాటలోనే మరికొంత మంది హీరోలు, దర్శకులు ముచ్చటగా తమకు హిట్టించిన దర్శకులతో మూడోసారి పనిచేస్తున్నారు. మరి వీరందరూ హైట్రిక్ కొడుతారా? లేదా? అన్నది వేచిచూడాలి.