Lizard: ఎవరి ఇంట్లో అయినా బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, బల్లులు ఉండటం కామన్. కానీ ఇవి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి కాబట్టి ఇంట్లో ఉండటం చాలా మందికి ఇష్టం ఉండదు. బల్లులు అంటే కూడా చాలా మందికి నచ్చదు. కానీ కొందరు మాత్రం బల్లి ఇంట్లో ఉండే కీటకాలను తినేస్తుందని అలాగే వదిలేస్తారు. ఇక ఈ బల్లులు గోడల మీద మూలల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. జ్యోతిష్యంలో బల్లికి కూడా ప్రాధాన్యత ఉంది. దీన్ని కొందరు శుభంగా పరిగణిస్తే మరికొందరు అశుభంగా పరిగణిస్తారు. ఇంతకీ ఇది మంచిదా చెడ్డదా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బల్లికి భయపడి ఇంట్లో నుంచి తరిమే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు కొందరు. కానీ జ్యోతిష్యంలో బల్లిని శుభప్రదంగా చూస్తారు. డబ్బు విషయాలలో కలిసి వస్తుందని అంటారు పండితులు. బల్లి లక్ష్మీదేవికి సంబంధించినదని బల్లి ఇంట్లో ఉండాలని అంటారు. .ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో, కొత్త ఇంటి వాస్తు పూజ చేసే సమయంలో వెండి బల్లి విగ్రహాలకు పూజ చేస్తారట. ఎందుకంటే బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను తెస్తుందని నమ్ముతారు.
పూజ గదిలో రిసెప్షన్ గదిలో బల్లులు కనిపించడం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. త్వరలోనే మీరు మరింత డబ్బును సంపాదించబోతున్నారని సూచిస్తుందట. దీపావళి రోజున ఇంట్లో బల్లి కనిపిస్తే ఆ సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహం లభించినట్టేనట. దీనివల్ల అపారమైన ఆనందం కలుగుతుందట.
ఇంట్లో ఒకే చోట 3 బల్లులను చూడటం మరింత అదృష్టం అంటున్నారు పండితులు. ఇలా చూస్తే మీరు వెంటనే శుభవార్త వింటారట. గృహప్రవేశం తర్వాత ఆ ఇంట్లో బల్లిని చూస్తే చాలా శుభప్రదం అంటున్నారు పండితులు. అంతే కాదు బల్లిని చూస్తే పూర్వీకుల దీవెనలు పొందినట్లేనట. అంటే పూర్వీకుల ఆశీస్సులు, అనుగ్రహం లభించనట్టనట.