Health Tips: శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో తెలుసా? అసలు ఏం తినాలంటే?

యాపిల్, అరటి, నారింజ, బత్తాయి, జామ వంటి పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పాలకూర, చిక్కుళ్లు, చిలగడ దుంపలు, పప్పుల వంటి వాటిల్లోనూ పిండి పదార్థాలు ఉంటాయి.

Written By: Swathi Chilukuri, Updated On : July 4, 2024 5:45 pm

Health Tips

Follow us on

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి సమస్యల నుంచి దూరం అవవచ్చు. మంచి ఆహారం వల్ల నిస్సత్తువ, అలసటకు దూరంగా ఉండవచ్చు. మరి మంచి ఆహారం ఏంటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే దంపుడు బియ్యం చాలా మంచివి అంటున్నారు నిపుణులు. గింజ ధాన్యాల్లో పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇవి ఆలస్యంగా జీర్ణం అవుతాయి. అదేవిధంగా ఎక్కువ శక్తిని కూడా ఇస్తాయి.

యాపిల్, అరటి, నారింజ, బత్తాయి, జామ వంటి పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పాలకూర, చిక్కుళ్లు, చిలగడ దుంపలు, పప్పుల వంటి వాటిల్లోనూ పిండి పదార్థాలు ఉంటాయి. ఇక ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. ఇందుకోసం బాదం, పిస్తా, అక్రోట్ల వంటివి తినండి. ఇక పొద్దు తిరుగుడు, గుమ్మడి వంటి విత్తనాలు కూడా చాలా మేలు చేస్తాయి. అంతేకాదు పెరుగు, పప్పుల్లో కూడా ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. శాఖాహారాలు వీటిని తినడం మంచిది.

మాంసాహారులైతే గుడ్లు, చికెన్, చేపలు తినడం వల్ల మీకు ప్రోటీన్ అందుతుంది. అలసటగా ఉందంటే శరీరంలో నీరు కూడా తక్కువ ఉన్నట్టే. ఒంట్లో కొద్దిగా నీరు తగ్గినా అలసట అనిపిస్తుంది. ప్రోటీన్ ఫుడ్ తో పాటు శరీరంలో ద్రవాలు కూడా అవసరమే. అందుకే ద్రవాలు తగ్గితే గుండె కొట్టుకోవడంలో తేడా వస్తుంది. దీని వల్ల శక్తి సన్నగిల్లుతుంది. అందుకే వేడి వాతావరణంలోకి వెళ్లినప్పుడు త్వరగా అలసిపోతారు చాలా మంది.

శరీరంలో తగినంత నీరు ఉండాలంటే మీరు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తీసుకోవాలి. . దీంతో శరీరంలోని అన్ని భాగాలు సరిగ్గా పనిచేస్తాయి. ఇంట్లో వెంటనే చురుకుదనం వస్తుంది. కొన్ని పదార్థాలు, పానీయాలు శక్తిని సన్నగిల్లేలా చేస్తాయి జాగ్రత్త. ప్రధానంగా కెఫెన్ తో కూడినవి శక్తి సన్నగిల్లేలా చేస్తాయట. అయితే కెఫెన్ తో చురుకుదనం వస్తుంది కదా అనుకుంటున్నారా? కానీ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా నీరసంగా అయిపోతారట జాగ్రత్త.