Life Style: చాలామందికి నిద్ర అంటే చాలా ఇష్టం. ఆలస్యంగా లేవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ చూసుకుంటూ ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీంతో ఉదయం సరైన సమయానికి అసలు లేవలేరు. రాత్రి తొందరగా నిద్రపోరు. ఉదయం తొందరగా లేవలేరు. అయితే ఏదైనా పని ఉంటే మాత్రం తప్పకుండా లేవాలి. అలాంటి సమయాల్లో చాలా మంది అలారం పెట్టుకుని లేస్తారు. ఇలా అలారం పెట్టుకున్నప్పుడు అది మోగుతూనే ఉంటుంది. కానీ మనకి మాత్రం అసలు లేవాలని అయితే ఉండదు. కొన్నిసార్లు ఆ అలారం సౌండ్ వల్ల ఒక్కసారిగా లేస్తాం. పడుకోవాలని ఉన్నా కూడా కష్టపడి ఆ అలారం సౌండ్‌కి లేస్తుంటాం. అయితే కొందరు అలారం లేకపోయిన కూడా సరైన సమయానికి లేస్తారు. అసలు ఎలాంటి సౌండ్ లేకపోయిన అలా ఎలా లేస్తారో అని చాలా మంది అనుకుంటారు. అయితే ఎలాంటి సౌండ్ లేకుండా అనుకున్న సమయానికి లేవాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అయితే ఎలాంటి నియమాలు పాటించడం వల్ల అలారం లేకుండా ఈజీగా నిద్రలేవాలో తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి.
ఎలాంటి అలారం లేకుండా నిద్ర లేవాలంటే ముఖ్యంగా రోజూ ఒక సమయం పాటించాలి. ఉదాహరణకు ఒక రోజు 10 గంటలకు నిద్రపోయి, మరుసటి రోజు 12 గంటలకు నిద్రపోకూడదు. రోజూ కూడా ఒకే సమయానికి నిద్రపోయి, లేస్తేనే టైమ్ సెట్ అవుతుంది. ఎంత బిజీ వర్క్ కూడా ఒక సమయం పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి తప్పితే పర్లేదు. కానీ రోజూ అలా టైమ్ మారితే మళ్లీ అలారం వెనుక పడాలి. ఉదయం అనుకున్న సమయానికి లేవాలి అంటే మెడిటేషన్, యోగా, వ్యాయామం వంటివి చేయాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయి, లేచేలా ఇవి మీ బాడీని ట్రైన్ చేస్తాయి. ముఖ్యంగా నిద్రపోయే ముందు కళ్లు మూసుకుని ఒక పది నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. ఉదయం మీరు ఏ సమయానికి లేవాలి అనుకుంటున్నారో.. ఆ సమయాన్ని మనస్సులో అనుకోండి. ఇలా అనుకుని మెడిటేషన్ చేయడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఉదయం అనుకున్న సమయానికి లేస్తారు.
ఉదయం అనుకున్న సమయానికి లేవాలంటే రాత్రిపూట నిద్రకు భంగం కలిగించే పదార్థాలను అసలు తీసుకోవద్దు. ముఖ్యంగా కెఫిన్ ఉండే పదార్థాలకు అయితే దూరంగా ఉండాలి. అలాగే మద్యపానం వంటివి కూడా తీసుకోకూడదు. వీటివల్ల ఆలస్యంగా నిద్రపోయి లేస్తారు. మళ్లీ మీ డైలీ రొటీన్ మిస్ అవుతుంది. రాత్రిపూట కూడా ఎక్కువగా తినకుండా కాస్త తక్కువగా భోజనం చేయాలి. ఎక్కువగా భోజనం చేస్తే పొట్ట నిండిపోయి నిద్రపోతారు. రాత్రిపూట నిద్రపోయే ముందు గది అంతా కూడా చీకటిగా ఉండేలా చూసుకోండి. ఏదో ఒక మూల కాస్త వెళ్తురు ఉన్నట్లు చూసుకోండి. దీనివల్ల మీకు హాయిగా నిద్రపడుతుంది. దీంతో ఉదయం పూట కూడా లేవగలరు. మీకు మీరే సొంతంగా లేస్తే రోజంతా బాగుంటుంది. నిద్రమత్తు కూడా ఉండదు. అదే అలారం సౌండ్‌కి కష్టం లేవడం వల్ల రోజంతా చిరాకుగా ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ.. ఎలాంటి అలారం సౌండ్ లేకుండా సొంతంగా లేవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.