https://oktelugu.com/

Life Style: అమ్మాయిలు ఈ ఫుడ్స్ డైట్‌లో యాడ్ చేసుకుంటే.. మీ అందానికి తిరుగే ఉండదు

బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అదే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అందం ఎప్పటికీ అలానే ఉంటుంది. మరి అందంగా ఉండాలంటే ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆ పదార్థాలేంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 2, 2024 8:33 pm
    skin glow

    skin glow

    Follow us on

    Life Style: అందానికి అమ్మాయిలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మెరవడానికి ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు చిన్న చిన్న సహజ చిట్కాలు కూడా పాటిస్తుంటారు. అయితే అందంగా కనిపించాలంటే కేవలం ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడితే సరిపోదు. ఆహారంలో కూడా కొన్ని రకాల పదార్థాలు చేర్చుకోవాలి. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అదే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అందం ఎప్పటికీ అలానే ఉంటుంది. మరి అందంగా ఉండాలంటే ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆ పదార్థాలేంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.

    రాగులు
    రాగుల్లో విటమిన్లు, కాల్షియం, పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. రాగుల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒత్తిడి లేకుండా ఉంటే సగం అందం పెరిగినట్లే. ఈ రాగులతో జావ, రోటీ, పాన్ కేక్, దోశ ఇలా మీకు నచ్చిన విధంగా తయారు చేసుకుని తినవచ్చు. డైలీ లైఫ్‌లో తప్పకుండా రాగులను ఏదో విధంగా యాడ్ చేసుకోవడం వల్ల యంగ్ లుక్‌లో కనిపిస్తారు. బ్యూటీ ప్రొడక్ట్స్ కాస్త ఖర్చుతో కూడుకున్నవి. అదే ఇలాంటివి అయితే ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం అవుతుంది.

    మెంతులు
    వంటలకు ఎక్కువగా ఉపయోగించే మెంతుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. మెంతుల్లో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటివి అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి బరువును అదుపులో ఉంచడంతో పాటు స్కిన్‌పై మొటిమలు రాకుండా కాపాడుతుంది. అయితే ఈ మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి వాటిని కాస్త మరిగించి.. ఆ నీటిని తాగితే చర్మం అందంగా తయారవుతుంది. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వాటర్ తాగలేని వారు మెంతులను కూరల్లో కూడా ఉపయోగించవచ్చు.

    నల్ల నువ్వులు
    నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వులను డైలీ డైట్‌లో యాడ్ చేసుకుంటే శరీరానికి రక్తం చేకూరుతుంది. అయితే నల్ల నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.. మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. నల్ల నువ్వుల్లో ఎక్కువగా పీచు ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.