IPhone Manufacturing: మొబైల్ ఫోన్ దిగ్గజం Apple ను కొనాలని చాలా మంది కోరుకుంటారు. మిగతా ఫోన్ల కంటే ఇవి అత్యధిక బెస్ట్ ఫీచర్స్ ఉండడంతో పాటు సెక్యూరిటీ ఎక్కువగా ఇచ్చే ఈ మొబైల్స్ కొత్త సీరీస్ వచ్చిన వెంటనే దక్కించుకుంటారు. అయితే ఒకప్పుడు చైనాలో మాత్రమే లైవ్ లో కనిపించే Apple మొబైల్ ఇక నుంచి భారత్ లోనూ చూడొచ్చు. అంటే ఈ కంపెనీకి చెందిన iPhone-17ను తయారు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. వాస్తవానికి కరోనా తరువాత నే యాపిల్ కంపెనీ చైనా వెలుపల తమ ఫోన్లను తయారు చేయడానికి సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో భారత్ ఆహ్వానించడంతో ఇక్కడ ప్లాంట్ ను నెలకొల్పారు. అతికొద్ది రోజుల్లో iPhone-17 ప్రక్రియను ప్రారంభించి 2025 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
చైనా నుంచి బయటకు వచ్చిన తరువాత Apple కంపెనీ భారత్ వైపే చూసింది. ఈక్రమంలో గత నెలలో iPhone 16 సిరీస్ ఉత్పత్తిని ప్రారంభించింది.ప్రస్తుతంప్రపంచ వ్యాప్తంగా iPhone 16 4 సిరీస్ లు ఉన్నాయి. వీటిలో iphoe 16తో పాటు iphoe 16 plus, iphoe 16 pro, iphoe 16 pro max ఉన్నాయి. ఇందులో మొదటి సిరీస్ ను భారత్ లో తయారు చేస్తున్నారు. ఈ వేడి వార్త చల్లారకముందే Apple కంపెనీ భారతీయులకు మరో శుభవార్త తెలిపింది. త్వరలోనే iPhone-17 ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు పేర్కొంది. దీంతో చైనాయకు భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు యాపిల్ ఫోన్ కు సంబంధించిన విడిభాగాల కోసం చైనాపై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు భారత్ వాటిని ఉత్పత్తి చేయడానికి ముందుకు రావడంతో కంపెనీ ప్రతినిధులు సైతం ఓకే చేశారు. ఈ నేపథ్యంలో చైనాలోని కొన్ని కర్మాగారాలను భారత్ ను తరలించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే భారత్ లో యాపిల్ కంపెనీ చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఎందుకంటే భారత్ లో ఐఫోన్ ప్రియులు రోజురోజుకు పెరిగపోతున్నారు. దీని నుంచి ఏ కొత్త సిరీస్ వచ్చినా కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చే iPhone-17భారత్ లోనే తయారు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
iPhone-17 ఉత్పత్తి ప్రక్రియను ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభించి మే వరకు పూర్తి చేస్తామని ఆ తరువాత వచ్చే ఏడాది మధ్యలో కొత్త ఫోన్ వినియోగదారుల ముందు ఉంటుందని పేర్కొంటున్నారు. యాపిల్ నిర్ణయంతో భారతీయ ఇంజనీర్ల సామర్థ్యం తెలిసిపోతుందని, ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా దేశానికి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన మొబైల్స్ కంటే కొత్తగా వచ్చే iPhone-17 డిస్ ప్లేతో పాటు ఆకట్టుకునే ఫీచర్లు ఉంటాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో iPhone-17 సిరీస్ తో చైనాలోని జెంగ్ జౌ, ఫాక్స్ కాన్ ఉత్పత్తులు గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.