Homeఎంటర్టైన్మెంట్Suma Kanakala Daughter Photos: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన యాంకర్ సుమ కూతురు.. ఇలా ఉందేంటి!

Suma Kanakala Daughter Photos: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన యాంకర్ సుమ కూతురు.. ఇలా ఉందేంటి!

Suma Kanakala Daughter Photos: టీవీ సీరియల్ హీరోయిన్ గా కెరీర్ ని మొదలుపెట్టిన సుమ(Suma Kanakala), ఆ తర్వాత యాంకర్ గా మారి ఎంత పెద్ద రేంజ్ కి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బుల్లితెర పై ఎన్నో వందల షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చిన ఆమె, ఇప్పటికీ కూడా అదే రేంజ్ డిమాండ్ తో కొనసాగుతోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అయితే సుమ హవా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న హీరోల సినిమాల దగ్గర నుండి, పాన్ ఇండియన్ హీరోల సినిమాల వరకు, ప్రతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈమె చేతుల మీదనే జరుగుతుంది. ఇండస్ట్రీ లో ఈమధ్య కాలం లో ఎంతో మంది యాంకర్లు పుట్టుకొచ్చారు. కానీ ఒక్కరు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సుమ మేనియా ని అందుకోలేకపోయారు. భవిష్యత్తులో కూడా ఆమె రేంజ్ ని అందుకోవడం కష్టమే.

Also Read: తెలంగాణ రాష్ట్ర ఖజానా ‘నిల్’నా?

ఇదంతా పక్కన పెడితే సుమ , రాజీవ్ కనకాల దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న సంగతి తెలిసిందే. కొడుకు రోషన్ రీసెంట్ గానే సినిమాల్లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు చేసాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. ఇక కూతురు పేరు మనస్విని. ఈమె ఎక్కువగా సోషల్ మీడియా కనిపించదు. బయట కూడా చాలా అరుదుగా ఈమెని చూసి ఉంటాము. అయితే నిన్న అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సుమ తన కూతురు మనస్విని తో కలిసి వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలో మనస్విని ని చూసిన ప్రతీ ఒక్కరు , సుమ కి ఇంత పెద్ద కూతురు ఉందా ?, చూసేందుకు అందంగా ఉన్నప్పటికీ , చాలా సింపుల్ గా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కి సుమ ఖరీదైన బట్టలు , మెడలో ఖరీదైన నెక్లెస్ వేసుకొని వచ్చింది . కానీ మనస్విని మాత్రం చాలా సింపుల్ బట్టలతో , ఒంటిమీద పది గ్రాముల బంగారు నగలు కూడా ధరించకుండా చాలా సింపుల్ గా వచ్చేసింది. ఇక సుమ ని , మనస్విని ని పక్కపక్కనే నిల్చోబెట్టి చూస్తే, వీళ్లిద్దరు అమ్మా కూతుర్లు అంటే ఎవ్వరూ నమ్మరు. అక్కా చెల్లెల్లు అంటే మాత్రం కచ్చితంగా నమ్ముతారు. ఈ వయస్సులో కూడా సుమ ఆ రేంజ్ అందాన్ని మైంటైన్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారిన ఈ ఫోటోని మీరు కూడా చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు!

Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని కోరారు....

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఏపీ ఎంపీకి ఛాన్స్?!

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే.....

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Oktelugu Epaper
Exit mobile version